హోమ్ /వార్తలు /తెలంగాణ /

mim mla : నమస్తే పెట్టలేదని... ఎమ్మెల్యే కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు..

mim mla : నమస్తే పెట్టలేదని... ఎమ్మెల్యే కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు..

Mim mla mumtaz khan

Mim mla mumtaz khan

mim mla : ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మాద్ ఖాన్ కు సలామ్ చేయకపోవడంతో ఆయన అంగరక్షకులు ఓ యువకుడిని కొట్టారంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పాతబస్తిలోని ఎమ్‌ఐఎమ్ ఎమ్మెల్యేపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను అకారణంగా కొట్టారంటూ పోలీసుల ముందు వాపోయాడు. వివరాల్లోకి వెళితే.. చార్మినార్ బస్‌ డిపో సమీపంలోని అర్థరాత్రి 12 గంటలకు అక్కడి గల్లీలో ఓ ఇంటిముందు కూర్చున్న జిలాని అనే యువకుడు అటువెళుతున్న ఎమ్మెల్యేకు సలాం పెట్టకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యే అంగరక్షులు కొట్టారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు సలాం పెట్టడం తెలియదా అంటూ కొట్టారని వాపోయాడు. ఈ దాడిలో యువకుడి ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్టు ఉస్మానియా వైద్యులు ఎమ్మెల్సీ రిపోర్టులో వెల్లడించినట్టు చెప్పాడు. అయితే దీంతో జిలాని స్థానిక హుసేని ఆలాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు మాత్రం కేసును నమోదు చేయలని , సీసీ టీవీ ఫుటేజి చూసిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పారు. దీంతో జిలాని ఎంపీ అసదుద్దిన్ ఓవైసిని కలిసి ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. అయితే అసదుద్దిన్ సైతం తనను ఓపిక పట్టాలని చెప్పినట్టు చెప్పారని వివరించాడు.

డెంగ్యూతో ఎమ్మెల్యే మృతి..

గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆవాబెన్ పటేల్ డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా గతంలో ఆమె కొరోనా వ్యాధికి గురయింది. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఆరుసార్లు బీజేపీ తరపున ఆ స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్‌ పటేల్‌ని ఆమె ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు.

అయితే, పార్టీతో విభేదాలు రావడంతో 2019 ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆశాబెన్‌ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు.

wife beats husband : రోజు భర్తను చితకబాదిన భార్య... భరించలేని భర్త ఆత్మహత్య...?


CM kcr : జిల్లాల పర్యటనలో సీఎం కేసిఆర్.. ఫలితాల తర్వాత టూర్..


Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Hyderabad, MIM

ఉత్తమ కథలు