క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్ తరలింపు

గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ మీద చాంద్రాయణగుట్టలో హత్యాయత్నం జరిగింది.అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

news18-telugu
Updated: June 9, 2019, 4:44 PM IST
క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్ తరలింపు
అక్బరుద్దీన్ (File)
news18-telugu
Updated: June 9, 2019, 4:44 PM IST
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ను చికిత్స కోసం లండన్ తరలించారు. గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ మీద చాంద్రాయణగుట్టలో హత్యాయత్నం జరిగింది. పహిల్వాన్ అనే రౌడీషీటర్ కాల్పులు జరపడంతో ఒవైసీ తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఒవైసీ అరోగ్యం క్షీణించడంతో లండన్‌కు తరలించారు. దీనికి సంబంధించి ఎంఐఎం పార్టీ వర్గాలు న్యూస్‌18కు ధ్రువీకరించాయి. హైదరాబాద్ దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ అంశం గురించి అసదుద్దీన్ ఒవైసీ కూడా తెలియజేశారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగుపడేలా ప్రార్థనలు చేయాలంటూ అందరినీ కోరారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...