లాక్‌‌డౌన్‌ తిప్పలు ఇంతింతకాదయా.. నడి రోడ్డుపైనే ప్రసవించిన మహిళ..

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్ ప్రభావం సాధారణ జీవితంపై భారీగానే పడుతోంది. తాజాగా, ఓ మహిళ నడి రోడ్డుపైనే ప్రసవించింది.

  • Share this:
    లాక్‌డౌన్ ప్రభావం సాధారణ జీవితంపై భారీగానే పడుతోంది. తాజాగా, ఓ మహిళ నడి రోడ్డుపైనే ప్రసవించింది. అదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనిత, లోకేష్‌ దంపతులు. అనిత నిండు గర్భిణి. అయినా ఆ దంపతులు నడుచుకుంటూ సొంతూరుకు బయలుదేరారు. అప్పటికే 70 కిలోమీటర్ల దూరం కూడా నడిచారు. ఈ క్రమంలో ఆమె నడుస్తుండగానే ఈ రోజు ఉదయం 4 గంటలకు నొప్పులు వచ్చి నడిరోడ్డుపైనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు అనితను రామాయంపేట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: