Home /News /telangana /

MIDDILE AGED MAN MURDERED BY UP YOUNGER AND INCIDENT HAPPEND IN MAHABUBNAGAR MBNR

Mahabubnagar: రోడ్డు పక్కన బైక్ ఆపి భార్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఎంతపని జరిగిందో చూడండి..

పోలీసులు అదుపులో నిందితుడు

పోలీసులు అదుపులో నిందితుడు

భూత్పూర్ మండలంలోని సిద్దయ్యపల్లికి చెందిన సీకూరి గోపాల్ (45) ఎదిర శివారులో హత్యకు గురయ్యాడు. రోజూలానే ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లిన గోపాల్ జూలై 1వ తేదీన జిల్లా కేంద్రంలో పండ్లు అమ్మి భార్య శ్యామలమ్మ వద్దకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు.

ఇంకా చదవండి ...
    మహబూబ్‌నగర్: ఆ వ్యక్తంటే ఊళ్లో అందరికీ అభిమానం. అందుకు కారణం కల్లాకపటం లేని అతని మనస్తత్వం. అందుకే అతనంటే నచ్చని వాళ్లెవరూ ఆ ఊళ్లో లేరు. కానీ.. అలాంటి అమాయకుడు ఊహించని రీతిలో చనిపోయాడు. దారుణ హత్యకు గురయ్యాడు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, డబ్బు కోసం అతనిని ఓ యువకుడు చంపేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్ రూరల్‌లోని ఓ గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్‌‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. భూత్పూర్ మండలంలోని సిద్దయ్యపల్లికి చెందిన సీకూరి గోపాల్ (45) ఎదిర శివారులో హత్యకు గురయ్యాడు. రోజూలానే ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లిన గోపాల్ జూలై 1వ తేదీన జిల్లా కేంద్రంలో పండ్లు అమ్మి భార్య శ్యామలమ్మ వద్దకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. మహబూబ్‌నగర్ శివారులోని ఎదురు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి బహిర్భూమికి వెళ్ళాడు. అప్పుడే ఏనుగొండ గ్రామంలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ గ్రామానికి చెందిన పెయింటింగ్ పనులు చేసుకునే సహన్ షా ఎదిరా గ్రామంలో మద్యం తాగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు.

    ముళ్ళ చెట్ల వద్ద భార్యతో ఒంటరిగా ఫోన్లో మాట్లాడుతున్న గోపాల్‌ను చూసి ఫోన్, డబ్బులు ఎత్తుకెళ్లాలనుకున్నాడు. అందుకు ఓ ఎండిపోయిన చెట్టు కొమ్మతో గోపాల్‌పై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. గోపాల్ ప్యాంట్‌లోని రూ.500తో పాటు, అతని ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి ఏనుగొండ గ్రామానికి వెళ్ళిపోయాడు.

    ఇది కూడా చదవండి: Shocking Incident: రూ.70 వేలు అప్పు తీసుకుని తిరిగివ్వడం లేదని అప్పు చేసిన వ్యక్తి భార్య ఫొటోను...

    అయితే.. దొంగిలించిన గోపాల్ ఫోన్ నుంచి తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి ఆ తర్వాత స్విచాఫ్ చేశాడు. ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. గోపాల్‌ను చంపింది తానేనని షహన్షా ఒప్పుకోవడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Brutally murder, Mahabubnagar, Murder, Phone calls

    తదుపరి వార్తలు