మిడ్ మానేరు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత...గేట్లకు అడ్డంగా నిలబడిన బాధితులు...

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ముంపు బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: August 30, 2019, 11:15 PM IST
మిడ్ మానేరు ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత...గేట్లకు అడ్డంగా నిలబడిన బాధితులు...
ప్రాజెక్టు నిర్వాసితులు
news18-telugu
Updated: August 30, 2019, 11:15 PM IST
మిడ్ మానేరు గేట్లు తీయవద్దు అని ముంపు బాధితులు గేట్లకు అడ్డంగా ఆందోళన చేస్తున్నారు. రాజన్నసిరిసిల్లా జిల్లాలోని కొదురుపాక బాధితులు ఘటన స్థలానికి చేరుకొన్నారు. అక్కడే నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ముంపు బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నట్లు అధికారులు సైరన్ సైతం మోగించారు. మరోవైపు ఉదయం కొదరుపాకలో అఖిలపక్షం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఇందులో ఈ సభకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేఎస్, వామపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. మిడ్ మానేరు ముంపు బాధితులను ఆదుకోవాలని పార్టీలన్నీ ముక్త కంఠంతో పిలుపునిచ్చాయి.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...