తెలంగాణ యువకుడికి బంపర్ ప్యాకేజ్.. కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం బాంబే ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తాజా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో మైక్రోసాఫ్ట్ మొత్తం ముగ్గురిని ఎంపిక చేయగా.. అందులో సాయిచరిత్ రెడ్డి ఒకరు కావడం విశేషం.

  • Share this:
    నల్గొండ జిల్లాకు చెందిన చింతరెడ్డి సాయిచరిత్ రెడ్డి అనే ఐఐటీ స్టూడెంట్ మైక్రోసాఫ్ట్‌లో బంపర్ ప్యాకేజీ అందుకున్నాడు. ఏడాదికి రూ.కోటిన్నర వార్షిక వేతనాన్ని మైక్రోసాఫ్ట్ అతనికి ఆఫర్ చేసింది. ప్రస్తుతం బాంబే ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తాజా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో మైక్రోసాఫ్ట్ మొత్తం ముగ్గురిని ఎంపిక చేయగా..
    అందులో సాయిచరిత్ రెడ్డి ఒకరు కావడం విశేషం. సాయిచరిత్ రెడ్డికి భారీ ప్యాకేజీ ఆఫర్ లభించడం పట్ల అతని తల్లిదండ్రులు సైదిరెడ్డి, సీత సంతోషం వ్యక్తం చేశారు. సాయి చరిత్ రెడ్డి ముందు నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేవాడని.. ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో కష్టపడి చదివాడని చెప్పారు. ప్రతిష్టాత్మక సంస్థలో భారీ ప్యాకేజీ ఆఫర్ రావడం సంతోషంగా ఉందన్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published: