Home /News /telangana /

MICROFINANCE COMPANIES HARASSING BORROWERS KMM EVK

Micro Finance Companies : "మైక్రో" న‌ర‌కం.. అప్పు తీసుకొన్న వారిని వేధిస్తున్న‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొడుకు చదువు.. కూతురి విదేశీ విద్య.. లేక పెళ్లి ఇంకా ఆసుపత్రి ఖర్చులు.. ఇలా అత్య‌వ‌స‌వ‌స‌రాలు చాలా మంది మైక్రో ఫైనాన్స్‌ల వ‌ద్ద అప్పు చేస్తుంటారు. అప్పు చెల్లిండంలో ఆల‌స్యం అయితే మాత్రం స‌ద‌రు కంపెనీలు జ‌నాల‌ను చెల్లింపుల కోసం తీవ్రంగా ఒత్తిడి గురి చేస్తుండ‌డంతో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. కొంద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకొనేదాక వెళ్తున్నారు.

ఇంకా చదవండి ...
  - జి.శ్రీనివాసరెడ్డి, ఖ‌మ్మం, న్యూస్ 18
  కొడుకు చదువు.. కూతురి విదేశీ విద్య.. లేక పెళ్లి ఇంకా ఆసుపత్రి ఖర్చులు.. లేదా పెట్టుబడులు వెరసి అవసరం ఏదైనా ఆదుకోడానికి మేమున్నామంటూ అండగా నిలుస్తారు. అవసరం ఎంతైనా ఎలాంటి తనఖా లేకుండానే సాయం చేస్తారు. పెద్ద మొత్తం అప్పుగా తీసుకుని చిన్న మొత్తాలుగా వారం వారం చెల్లించాలంటూ సున్నితంగా చెబుతారు. ఆశపడి వారి వలలో పడ్డామా.. ఇక అంతే సంగతులు.. వారం వారం చెల్లింపుల్లో ఏమైనా తేడా జరిగిందా పరువు గోవిందా.. సామాన్లు బయటపడేసినట్టే.. కుటుంబం పరువు నిండా గంగలో కలిసిపోయినట్టే. ఇలా పరువుకు భయపడి మళ్లీ వాళ్ల దగ్గరే ఇంకొంచం పెద్ద వడ్డీకి నగదు తీసుకుని ఆ అప్పును తీర్చడానికి కొత్త అప్పు చేస్తూ.. వాటికి వడ్డీలు.. ఆపైన చక్ర వడ్డీలు (Compound Interest).. నిర్వహణ ఖర్చులు.. అపరాధ రుసుంలు చెల్లిస్తూ చివరకు ఆర్థికంగా దెబ్బ‌తిని ఆత్మహ‌త్య‌లు చేసుకొనేదాక వెళ్తున్నారు.

  ఎక్కువ‌గా మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు మైక్రో ఫైనాన్స్ (Micro Finance) చేతిలో చిక్కుకొని ఇబ్బంది ప‌డుతున్నారు. అలాంటి ఘ‌ట‌నే ఖ‌మ్మం జిల్లా (Khammam)లో జ‌రిగింది.

  "ఆదూరి సన్నీ. స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ. ఇతను ఓ మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలో క్రెడిట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ కంపెనీకి నమ్మకంగా పనిచేశాడు. సడెన్‌గా ఆదివారం రోజు రైలు కింద పడి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. దీనికి ముందు అతను తన సమీప బంధువులకు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌ల సారాంశం ఏమంటే.. వసూళ్లలో టార్గెట్లు రీచ్‌ కాలేదన్న సాకుతో కంపెనీ పెద్దలు అతన్ని నిత్యం వేధిస్తుండడం..

  Telangana : బిల్డ‌ర్‌పై జీఎస్టీ అధికారి వేధింపులు.. రూ.10 లక్షలు డిమాండ్‌.. కేంద్ర మంత్రికి ఫిర్యాదు


  అప్పు తీసుకున్న వారి పరిస్థితి బాగోలేదని ఉన్న విషయం చెప్పినందుకు అతనిపై లేనిపోని ఆరోపణలు చేసి అతన్ని మానసికంగా తీవ్రంగా వేధించడంతో సన్నీ తట్టుకోలేకపోయాడు. కేవలం వసూళ్లలో ఉదాసీనత పాటించడమే పాపమై.. అతను కంపెనీకి టార్గెట్‌గా మారాడు. దీంతో అతనిపై నిందారోపణలు చేస్తూ.. జీతం ఆపేయడం.. టూవీలర్‌ లాక్కోవడంతో సన్నీ మానసికంగా కుంగిపోయాడు. తాను ఏ పరిస్థితుల్లో చనిపోతున్నానో వివరిస్తూ దగ్గరి బంధువులకు వాట్సాప్‌లో మెసెజ్‌ పెట్టాడు. ఆనక రైలు కింద పడి చనిపోయాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని భార్య అతని భార్య మౌనిక దిక్కులేనిదైంది."

  Huzurabad by-Election 2021 : వామ్మో.. ఇన్ని పైస‌లా.. ఎన్నిక‌ల వేళ హుజూరాబాద్‌కు నిధుల వ‌ర‌ద‌


  కంపెనీల‌పై నియంత్ర‌ణ క‌రువు..
  ఇచ్చిన అప్పును నిర్దాక్షిణ్యంగా వసూలు చేయలేదన్న కారణంగానే సొంత ఉద్యోగినే వేధించిన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు.. ఇక అప్పు తీసుకున్న వారి పట్ల ఎంతటి నిర్దయగా వ్యవహరిస్తుంటాయో ఊహించుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉండడం.. ఇక్కడి గిరిజనంలో ఉన్న అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని తక్కువ వడ్డీ పేరిట అప్పులు అంటగట్టడం.. ఆనక చెల్లించలేక సతమతమౌతున్న పరిస్థితుల్లో గ్రూపులో ఉన్న ఇతరుల నుంచి వత్తిడి పెట్టడం.. పరువు తీస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం షరా మామూలుగా మారింది. గతంలో ఈ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. మారిన పరిస్థితుల్లో సరళీకరణ ముసుగులో మళ్లీ సూక్ష్మ రుణ సంస్థల వసూళ్ల పర్వం కొనసాగుతునే ఉంది. ఎలాంటి తనఖాలు, లేకుండానే ఉన్నఫళంగా అప్పు ఇస్తుండడమే సామాన్యులు వీరి పాలిట పడి బలైపోవడానికి మార్గంగా ఉంది. వీళ్లంతా స్థానికంగా మండల కేంద్రాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో బోర్డులు పెట్టి మరీ తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అయినా వీరి ఆగడాలను ప్రశ్నించిన దాఖలా లేదు. వ్యాపార కార్యకలాపాలపై ఎవరికీ నియంత్రణ లేకపోవడం ఈ కంపెనీల దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Finance, Khammam, Loan apps, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు