హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Metro Rail : మెట్రో రైలు ఉండగా బైకులెందుకు... అంతేగా... అంతేగా...

Hyderabad Metro Rail : మెట్రో రైలు ఉండగా బైకులెందుకు... అంతేగా... అంతేగా...

హైదరాబాద్ మెట్రో రైలు

హైదరాబాద్ మెట్రో రైలు

Hyderabad Metro Rail Updates : మెట్రో రైలు వచ్చి ఏడాది దాటిన తర్వాత హైదరాబాద్‌ ప్రజల ఆలోచనా ధోరణి మారింది. మెట్రోలో వెళ్లడమే హాయి అంటున్నారు. బైకులను పక్కన పెడుతున్నారు. మీరూ ఆ లిస్టులో ఉన్నారా...

హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకో తెలుసా... వాళ్ల బిజినెస్ రోజురోజుకూ తగ్గుతోందట. ముఖ్యంగా మెట్రో రైలు వెళ్తున్న రూట్లలో ఉన్న బంకులకు వెళ్లే జనం తగ్గుతున్నారు. ఎందుకంటే... ఆ రూట్లలో జనం బైకులు, కార్ల కంటే... మెట్రో రైలులో వెళ్లడం బెటరని భావిస్తున్నారు. ఇందుకు చాలా కారణాలుంటున్నాయి. మెట్రో రైళ్లు టైముకి వస్తున్నాయి. చకచకా తీసుకెళ్తున్నాయి. పైగా... జర్నీ ఎంతో హ్యాపీగా సాగుతోంది. ట్రాఫిక్ జాంల గోలే లేదు. టికెట్ రేట్లు కాస్త ఎక్కువైనా... ట్రాఫిక్‌లో చిక్కుకొని గంటల తరబడి... వాహనాలు నడుపుతూ... బోల్డంత పెట్రోల్ వేస్ట్ చెయ్యడం కంటే... రైళ్లే మేలు అంటున్నారు హైదరాబాద్ వాసులు.


వాహనాలతో అన్నీ తలనొప్పులే : వాహనంపై వెళ్లాలంటే పెట్రోల్ మాత్రమే కాదు... సర్వీసింగ్ ఖర్చులు, ఇంజిన్ ఆయిల్ ఖర్చులు, చిన్నా చితకా ప్రమాదాలు జరిగితే... ఆ ఆదనపు ఖర్చులు... వీటికి తోడు బండ్లు మొరాయిస్తే ఎక్స్‌ట్రా ఖర్చులు, ఇవన్నీ చాలనట్లు టైర్లు పాడైనా, ప్యాచ్ పడినా తలనొప్పే. ఇలా నెలకు వేలకు వేలు వదిలిపోతున్నాయి. ఇక బైకుల్ని పార్కింగ్ చెయ్యడం మరో సమస్య. దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదమూ ఉంటుంది. వీటన్నింటికీ తోడు... పోలీసులు ఆపితే... డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటూ... సవాలక్ష సమాధానాలు చెప్పుకోవాలి. ఇవన్నీ ఎందుకు... చక్కగా మెట్రో రైలు ఎక్కితే... ఏ బాధా ఉండదని భావిస్తున్నారు సిటీ పీపుల్.


మెట్రో రైళ్లలో వెళ్తే ఎన్నో ప్రయోజనాలు : మెట్రో రైలు ప్రతీ ఐదు నిమిషాలకు ఒకటి వచ్చేస్తుంది. నిమిషం కూడా ఆలస్యం లేకుండా టైముకి గమ్య స్థానానికి తీసుకుపోతుంది. సిటీలో ఎక్కడి నుంచీ ఎక్కడికి వెళ్లాలన్నా... మాగ్జిమం గంట కంటే ఎక్కువ సమయం పట్టదు. అదే కారో, బైకో, బస్సో ఎక్కితే... ఉప్పల్ నుంచీ మియాపూర్ వెళ్లాలంటే ఈజీగా గంటన్నర, రెండు గంటలు పడుతుంది. వర్షాకాలంలోనైతే... మూడు గంటలు కూడా పడుతుంది. అందువల్ల మెట్రో రైళ్లు ప్రయాణ బడలిక తగ్గిస్తున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లను టైముకి చేర్చేస్తున్నాయి. టెన్షన్లను తగ్గిస్తున్నాయి. కాస్త టికెట్ ధరలు తగ్గిస్తే... ఇంకా మెరుగ్గా ఉంటుందని అందరూ అంటున్నారు.
ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వరకు రోజు దాదాపు 1.35 లక్షల మంది, నాగోలు నుంచి అమీర్‌పేట వరకు రోజూ 40 వేల మంది దాకా మెట్రోలో ప్రయాణిస్తున్నారు. హయత్‌నగర్‌ నుంచి వనస్థలిపురం, ఎల్బీనగర్‌, కొత్తపేట, నాగోలు, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేటలో వాళ్లు ఎక్కువగా మెట్రోలో వెళ్తున్నారు. ఈ రూట్లలో రోజూ 3 వేల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు తగ్గాయి. ఇక హైటెక్ సిటీ రూట్లలో కూడా మెట్రో వచ్చేస్తే... రైళ్లలో ప్రయాణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.


 


Video: మియాపూర్-ఎల్‌బీనగర్ మెట్రో రూట్ ప్రత్యేకతలు ఇవే..!

First published:

Tags: Hyderabad, Hyderabad Metro, Metro, Telangana News

ఉత్తమ కథలు