హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: స్కూల్‌ని బార్‌గా మార్చిన ఎంఈవో.. మద్యం తాగుతూ.. పేకాడుతూ చిందులు

Telangana: స్కూల్‌ని బార్‌గా మార్చిన ఎంఈవో.. మద్యం తాగుతూ.. పేకాడుతూ చిందులు

స్కూల్ ఆవరణలో మద్యం తాగుతున్న టీచర్లు, ఎంఈవో

స్కూల్ ఆవరణలో మద్యం తాగుతున్న టీచర్లు, ఎంఈవో

బేల మండల విద్యాధికారి కోల నర్సింహులు కొందరు ఉపాధ్యాయులతో కసిలి ఏకంగా పాఠశాల ఆవరణలోనే దుకాణం పెట్టారు. మద్యం తాగుతూ పేకాడుతూ చిందులేశారు.

  పాఠశాల.. ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులకు దేవాలయం లాంటిది. అలాంటి స్థలాన్ని ఓ విద్యాధికారే అపవిత్రం చేశారు. స్కూళ్లో టీచర్ తప్పులు చేస్తే హెడ్ మాస్టర్‌కు చెబుతారు. హెడ్ మాస్టర్ తప్పులు చేస్తే ఎంఈవోకు ఫిర్యాదు చేస్తారు.కానీ ఇక్కడ ఎంఈవోనే చెడ్డ దారిలో నడిచాడు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయులు.. ఆ ఉపాధ్యాయులు క్రమశిక్షణ తప్పితే గాడిలో పెట్టాల్సిన మండల విద్యాధికారి కలిసి.. పాఠశాల ఆవరణనే బార్‌గా మార్చేశారు. మద్యం తాగుతూ, జూదం ఆడుతూ చిందేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో జరిగింది.

  బేల మండల విద్యాధికారి కోల నర్సింహులు కొందరు ఉపాధ్యాయులతో కసిలి ఏకంగా పాఠశాల ఆవరణలోనే దుకాణం పెట్టారు. మద్యం తాగుతూ పేకాడుతూ చిందులేశారు. సదరు ఎంఈవో ఒక్క బేల మంలానికే కాకుండా మరో రెండు మండలాలకు కూడా ఇంచార్జి ఉన్నారు. విద్యార్థులకు మార్గదర్శులుగా నిలువాల్సిన ఉపాధ్యాయులు, వారికి మార్గ నిర్దేశం చేయాల్సిన ఎంఈవో కలిసి ఇలా చేయడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఎంఈవో ఉపాధ్యాయులు కలిసి మద్యం తాగుతూ పేకాడిన దృశ్యాలను ఎవరో గుట్టు చప్పుడు కాకూండా వీడియో తీశారు. ఇపుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులలు, ఎంఈవో తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే తప్పుటడుగులు వేస్తే.. ఈ సమాజం ఏమయిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ మద్యం తాగిన ఉపాధ్యాయులతో పాటు ఎంఈవోను ఉద్యోగం నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Adilabad, Telangana

  ఉత్తమ కథలు