తెలంగాణలో హైదరాబాద్ (Hyderabad)తర్వాత అంతే వేగంగా అభివృద్ధి చెందిన పట్టణంగా సిద్ధిపేట(Siddipeta)పేరు గాంచింది. అభివృద్ధిలోనే కాదు..ఇప్పుడు ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఈయర్ బోర్డ్ ఎగ్జామ్(Board Exam)ప్రశ్నపత్రంలో కూడా సిద్దిపేట ప్రస్తావన రావడంతో అభివృద్ధికి తగ్గిన గౌరవంగా చూడాలి. స్వచ్ బడి(Swachh Badi)పై ఓ వ్యాసం రాయమని నాలుగు మార్కుల ప్రశ్నగా బోర్డ్ ఎగ్జామ్ పేపర్లో వచ్చింది. దేశ వ్యాప్తంగా స్వచ్ఛ బడి పేరుతో రెండే రెండు ఉన్నాయి. రెండోవది సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్‌రావు(Harishrao)చేతుల మీదుగా ప్రారంభించబడింది. మొదటికి కర్నాటక(Karnataka) రాష్ట్రం బెంగుళూరు (Bangalore)లో ఉంది. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్దికి ప్రయోగశాల..ఒక అధ్యాయన కేంద్రమని మంత్రి హరీష్ రావు పలుమార్లు చెప్పుకొచ్చారు. అదే మాటను చాలా మంది ప్రముఖుల నోటి ద్వారా విన్నాం. అలాంటి మాటలు, నియోజకవర్గ అభివృద్దికి సాక్ష్యంగా నిలిచింది మంత్రి ప్రారంభించిన స్వచ్ బడి. దేశంలోనే రెండో బడిగా ఇక్కడ నెలకోల్పబడటం ఆ స్కూల్ ప్రత్యేకత, విశిష్టత గురించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి సోమవారం జరిగిన పరీక్షలో 4మార్కుల ప్రశ్న(4marks Question) గా రావడం సిద్దిపేట నియోజకవర్గానికి దక్కిన గౌరవంగా భావించాలి.
అభివృద్ధికి దక్కిన గౌరవం..
సిద్దిపేట స్వచ్ఛతలో ఆదర్శంగా నిలవాలంటే స్వచ్ బడి పాఠాలు ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే వేలాది మంది ఈ స్వచ్చ్ బడిని సందర్శించి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు లక్షలాది మంది హాజరయ్యే ఇంటర్ బోర్డు ఎగ్జామ్ పరీక్ష పత్రంలో చోటు దక్కడంతో ఈ విషయం ఇంకొన్ని లక్షల మందికి తెలిసిపోయింది. ఈవిషయంలో సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు గర్వంగా చూస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వినూత్నమైన, ఆదర్శమైన కార్యక్రమాలను చేపడతామంటున్నారు. సిద్దిపేటలోని స్వచ్ఛ బడి పేరు ప్రస్తావన బోర్డ్ ఎగ్జామ్ పరీక్షల్లో రావడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు మంత్రి హరీష్‌రావు. అభివృద్ధి ప్రజల భాగస్వామ్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్ ప్రశ్న పత్రంలో సిద్దిపేట పేరు..
నియోజకవర్గ అభివృద్ది, పరిశుభ్రత, ప్లాస్టివ్ నివారణ, ఇంకుడు గుంతుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ ఒకటి కాదు అన్నీ అంశాల్లో సిద్ధిపేటకు దక్కిన అవార్డులు,పొందిన గుర్తింపులే నియోజకవర్గ పేరును దశ, దిశ వ్యాప్తి చెందేలా చేసింది. అంతే కాదు దేశంలో నే ఇంకుడు గుంతలు నిర్మించి ఆదర్శ గ్రామంగా నిలిచింది సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామం. ఇంకుడు గుంతల నిర్మాణం ఒక ప్రయోగాత్మకం అంటూ పాఠ్యపుస్తకాల్లో పాఠంగా ప్రాచుర్యంలోకి వచింది. అదే స్ఫూర్తితో మరో గౌరవం సిద్దిపేట స్వచ్ బడి రూపం లో దక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Intermediate exams, Siddipeta