మానసిక స్థితి ఓ దళిత యువతిపై ఏడుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.. బయటికి చెప్పుకోలేని ఆ యువతికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ముందుగా ఒక దుర్మార్గుడు ఆ పనికి పాల్పడి తర్వాత తాగిన మైకంలో ఇతర స్నేహితులకు చెప్పడంతో వారు సైతం ఆయువతిని లోబరచుకున్నారు. దీంతో ఒకరికి తెలియకుండ ఒకరు అమ్మాయిపై లైంగిక చర్యకు పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమెలో శారీరకంగా వస్తున్న మార్పులతో పాటు ఆరోగ్యపరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. దీంతో ఆ యువతి గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం.
కాగా దారుణ సంఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామంలోని ఓ దళిత కుటుంబానికి చెందిన ఆ యువతికి మానసిక స్థితి సరిగా లేదు. ఆ యువతి తల్లిదండ్రులు కూలిపని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయువతిని ఇంట్లోనే వదిలి రోజు కూలి వెళతారు. ఈ సంధర్భంలోనే ఆయువతిపై అదే గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కన్ను పడింది. దీంతో తల్లిదండ్రులు లేనప్పుడు ఆ యువతి ఇంటికి వెళ్లిన యువకుడు మాయమాటలు చెప్పాడు. అనంతరం ఆమెను మాయమాటలతో శారీరకంగా లోబరుచుకున్నాడు. ఇలా కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న వ్యవహారాన్ని ఆ ఉద్యోగి మరో ప్లాన్ వేశాడు.. వ్యక్తిగతంగా ఎప్పుడైన ఇబ్బంది పాలవుతుందని భావించి ఆ విషయాన్ని తాగిన మైకంలో తన స్నేహితులతో పంచుకున్నాడు. ఇలా వారిని కూడా ఆ యువతి వైపుకు మళ్లించాడు.
Paddy Issue : ఖరీఫ్ ధాన్యం సమస్య క్లోజ్...అయినట్టేనా... అదనపు కొనుగోళ్లకు కేంద్రం అనుమతులు..
ఆ తర్వాత తన ఆరుగురు స్నేహితులు కూడా యువతి ఇంటికి వెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డారు. ప్రపంచపోకడల గురించి ఆ యువతి తాను చేస్తోంది ఏంటో తెలియని స్థితిలో నెట్టివేయబడింది. ఇలా వారంతా కలిసి ఆమెను గత ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే యువతి అనారోగ్యానికి పాల్పడింది. మరోవైపు శారీరక మార్పులు నెలకొనడంతో అనుమానంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్ష చేయించారు. దీంతో ఆ యువతి గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలియడంతో షాక్ తిన్న యువతి కుటుంబ సభ్యులు జరిగిన విషయంపై ఆరా తీశారు. దీంతో తనను ఏడుగురు వ్యక్తులు తనతో లైంగిక చర్య గురించి చెప్పింది. అయితే కుటుంబ సభ్యులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిని విచారిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. గ్రామస్థుల మధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ యువకులు మాత్రం తమకేమి తెలియదని చెబుతున్నట్టు సమాచారం.
December 31st Celebrations : మందు బాబులకు గుడ్ న్యూస్.. ఆ రోజు అర్థరాత్రి వరకు మందు సేల్..
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.