హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్‌కు చిరంజీవి బెస్ట్ విషెస్..

తెలంగాణ గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్‌కు చిరంజీవి బెస్ట్ విషెస్..

గవర్నర్‌, సీఎంతో చిరంజీవి (File/Photos)

గవర్నర్‌, సీఎంతో చిరంజీవి (File/Photos)

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి విషయమై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు ఈ రోజు పుట్టినరో్జు జరుపుకుంటున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు బెస్ట్ విషెస్ అందజేసారు.

ఇంకా చదవండి ...

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి విషయమై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బెస్ట్ విషెస్ అందజేసారు. ఎందరో అమరవీరుల త్యాగాల స్పూర్తిగా, దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన జన హృదయ నేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.   మరోవైపు ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ గవర్నర్ 2 జూన్  1961న జన్మించారు. ఈరోజు ఆమె 59వ ఏట అడుగుపెట్టారు. ఆమె ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకోవాలని కోరకుంటున్నట్టు ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్‌కు గవర్నర్ తమిళపై ధన్యవాదాలు తెలిపారు.


First published:

Tags: Chiranjeevi, CM KCR, Governor Tamilisai Soundararajan, Telangana, Tollywood