హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagababu:నువ్వో కుసంస్కారివి అంటూ ప్రకాష్ రాజ్ తీరును కడిగి పారేసిన నాగబాబు..

Nagababu:నువ్వో కుసంస్కారివి అంటూ ప్రకాష్ రాజ్ తీరును కడిగి పారేసిన నాగబాబు..

నాగబాబు, ప్రకాష్ రాజ్ (File/Photo)

నాగబాబు, ప్రకాష్ రాజ్ (File/Photo)

Nagababu-Prakash Raj | తెలంగాణలో జీహెఎంసీ (GHMC) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ..పవన్ కళ్యాన్ ఊసరవెల్లి అంటూ కామెంట్స్ చేయడం తీవ్ర కలకలం రేపాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Nagababu-Prakash Raj | తెలంగాణలో జీహెఎంసీ (GHMC) ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల పోరు పెరుగుతోంది. హైదరాబాద్ మహానగర పాలికకు జరుగుతున్న ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ప్రకాష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (pawan kalyan) వైఖరిని ఆయన తప్పుబట్టారు. మీరు ఒక పార్టీకి అధినేత అయి ఉండి.. వేరొక పార్టీని ఎందుకు భుజాలపై ఎత్తుకుంటున్నారని విమర్శించారు. పవన్ నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తలతో పాటు తననూ నిరుత్సాహానికి గురి చేసిందన్నారు ప్రకాష్ రాజ్. ఆయనో రాజకీయ ఊసరవెల్లి అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో స్పందించడంతో పాటు ఆయనకు గట్టి సమాధానమే ఇచ్చాడు.

ఈ సందర్భంగా నాగబాబు (Nagababu) మాట్లాడుతూ.. రాజకీయాల్లో అనేక సార్లు నిర్ణయాలు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయం వెనక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిదన్నారు. ఇపుడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి సపోర్ట్ చేయడం వెనక.. విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయనేది మా ఉద్దేశ్యం. ఎవడికి ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్.. నీ డొల్లతనం ఏంటో సుబ్రహ్మణ్య స్వామి డిబేట్‌లోనే అర్ధమైందన్నారు. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి పెట్టి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాతో పాటు చాలా మందికి ఇప్పటికీ ఈ సంఘటన గుర్తుంది.

నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించడంలో ఎలాంటి తప్పులేదు. అదే సమయంలో ప్రజలకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాలి. విమర్శించడం తప్ప మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ.. ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా.. బీజేపీ, జనసేన కూటమిని ఆపలేరు. నిర్మాతలకు డబ్బుల కోసం ఎంత హింసకు గురి చేసావో.. ఇచ్చిన డేట్స్‌ను క్యాన్సిల్ చేసి ఎంత హింసకు గురి చేసావో...ఇంకా గుర్తువున్నాయి.

prakash raj, pawan kalyan, janasena pawan kalyan, prakash raj on pawan kalyan, ghmc elections, greater elections, ghmc polls, hyderabad polls, telangana, tollywood, జీహెచ్ఎంసీ ఎన్నికలు, గ్రేటర్ పోల్స్, జీహెచ్ఎంసీ పోల్స్, పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్, టాలీవుడ్
పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్

ముందు నువ్వు మంచి మనిషిగా తయారై.. ఆ తర్వాత అపుడు పవన్ కళ్యాన్ అనే మంచి మనిషి నిస్వార్ధపరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్‌ను కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడటం తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని ప్రధాన మంత్రి మోదీని నువ్వు నోటికొచ్చినట్టు ఎంత విమర్శించినా.. నిన్ను ఎవరు ఏమి అనలేదంటే అది బీజేపీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ అని అర్ధం చేసుకో.  ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి ఖచ్చితంగా తమ సత్తా చాటబోతున్నాయి. మీడియా అడిగింది అని నీ రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు అంటూ సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నాగబాబు.

First published:

Tags: Hyderabad - GHMC Elections 2020, Nagababu, Pawan kalyan, Prakash Raj, Tollywood

ఉత్తమ కథలు