ఆ సీఎంలతో పోలిస్తే కేసీఆర్ వజ్రం... నాగబాబు పొగడ్తలు...

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

‘ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎంలు ఉన్న దేశంలో కేసీఆర్ లాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు.’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మీద మెగా బ్రదర్ నాగబాబు పొగడ్తల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌‌‌ను ఆకాశానికి ఎత్తేశారు. కేసీఆర్ మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగిందని నాగబాబు అన్నారు. ‘ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది. దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు. ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎంలు ఉన్న దేశంలో కేసీఆర్ లాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు.’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే, కేసీఆర్ మీద పొగడ్తలు కురిపించిన నాగబాబు.. పరోక్షంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద సెటైర్లు వేశారనేది ఆయనకే తెలియాలి. అయితే, ఏపీలో వైసీపీ ప్రభుత్వం, జనసేన పార్టీ మధ్య వైరం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నాగబాబు ట్విట్టర్ వేదికగా కొన్ని రోజుల క్రితం విపరీతంగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: