Home /News /telangana /

MEDICAL SHOPS HAVE INCREASED IN THE JOINT MAHABUBNAGAR DISTRICT DUE TO THE DEMAND FOR DRUG SALES AFTER CORONA SNR MBNR

Telangana : ఆ జిల్లాలో మెడికల్‌ షాపులకు భలే గిరాకీ .. జనం వాటికి అలవాటు పడటం వల్లేనంట..!

medical shops

medical shops

Telangana : పాలమూరు ఉమ్మడి జిల్లాలో కొత్తగా మెడికల్‌ షాపుల సంఖ్య 500 పెరిగాయి. ఆదాయం లక్షల్లో పెరిగింది. దీనంతటి కారణం ఏమిటంటే జిల్లా ప్రజలు కేవలం ముందు జాగ్రత్తగా వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్లేనంటున్నారు వ్యాపారులు.

  (Syed Rafi, News18,Mahabubnagar)
  ఉమ్మడి పాలమూరుMahabubnagar జిల్లాలో ఔషధ దుకాణాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా కరోనా (Corona)తర్వాత వీటి సంఖ్య ఎక్కువ అవుతుంది. కరోనా మొదటి దశ తర్వాత రెండేళ్లలో 407 మెడికల్ షాపులు(Medical shops) పెరిగాయంటే జిల్లాలో వ్యాపారం ఏస్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఔషధ నియంత్రణ శాఖ పాలమూరు ఉమ్మడి జిల్లా అధికారుల నివేదికల ప్రకారం పాలమూరు ఉమ్మడి జిల్లాలో 2020 ఏప్రిల్ (April)కంటే ముందు 1,161 మెడికల్ షాపులు ఉండేవి. కరోనా తర్వాత వాటి సంఖ్య 1568కి చేరుకుంది. కరోనా కారణంగా ఔషధాలకు డిమాండ్ బాగా పెరిగింది. వ్యాధులు వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే వ్యాధి లక్షణాలు కనిపించగానే మందులు వేసుకుంటే బెటర్ అని ఫీలవుతున్నారు.

  Harassment : లేడీ టీచర్‌కి వాట్సాప్‌లో అగ్లీ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్‌లు .. పంపింది ఎవరో కాదు ..!  500 కొత్త షాపులు ఏర్పాటు..
  కరోనా నేర్పిన గుణపాఠం కారణంగా పాలమూరు జిల్లాలో ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధకత పెంచుకోవడానికి విటమిన్ టాబ్లెట్లు వినియోగం బాగా పెరిగిందంటున్నారు ఔషద వ్యాపారులు. దీంతో కరోనా తర్వాత మెడికల్ షాపు ఓనర్లకు బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కరోనా సోకితే మందులు దొరుకుతాయో లేదో అని చాలామంది ముందే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకోవడం ప్రారంభించారు. కరోనా టైమ్‌లో రోజుకు .2.20 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిన రోజులు ఉన్నాయి. ఆ డిమాండ్‌తోనే జిల్లాలో కొత్తగా మెడికల్ షాపులు పెట్టడానికి కారణమైంది. వ్యాపారుల్లో ఆసక్తిని పెంచింది.  40శాతం పెరిగిన అమ్మకాలు..
  ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానికులు నిర్వహిస్తున్న మెడికల్ షాపులు 1.568 ఉంటే మరో 200 షాపులు కార్పొరేట్ సంస్థలకు చెందినవి ఉన్నాయి. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కరోనా కంటే ముందు ఓ కార్పొరేట్ సంస్థకు చెందిన ఔషధ దుకాణాలు ఆరు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 20కి చేరింది. వచ్చే రెండు మూడు నెలల్లో మరో 10 దుకాణాలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ఔషధ దుకాణాల ద్వారా రోజుకు సగటున రూ.1.10 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆయా వ్యాపార వర్గాలు తెలిపాయి. 2020 ఏప్రిల్‌కు ముందు రోజుకు కేవలం 60 నుంచి 70లక్షల రూపాయల బిజినెస్‌ మాత్రమే ఉండేది. రెండేళ్లలో 40శాతం అమ్మకాలు పెరిగాయి.

  Extramarital Affair: ప్రియుడితో రెడ్​ హ్యాండెడ్​గా దొరికిన భార్య.. కానీ, అదే అతనికి శాపమైంది.. ఏమైందంటే?  ఔషధ దుకాణాలు పెరగడానికి కారణాలు..
  జిల్లాలో మెడికల్ షాపులు పెరగడానికి ప్రధాన కారణం కరోనా తర్వాత ఔషధ వ్యాపారం లాభసాటిగా ఉంటుందనే అభిప్రాయంతోనే ఎక్కువ మంది షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైద్య విద్య పూర్తి చేసుకున్న వారు నేరుగా ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా వాళ్లే మెడికల్ షాపులు పెట్టుకుంటున్నారు. ఫార్మసీ విద్య పూర్తి చేసిన వారు 65% సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా మిగతా 30% తమ ధ్రువపత్రాలను ఇతరులకు ఇచ్చి అద్దె తీసుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు చెందిన పలు మెడికల్ షాపులు కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. డిస్కౌంట్‌లు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Mahabubnagar, Medical, Telangana News

  తదుపరి వార్తలు