MEDICAL COLLEGE STUDENTS PROTEST IN SANGAREDDY DISTRICT OVER OWNERSHIP FEE HIKE SNR MDK
Sangareddy : అడ్వాన్స్ ఫీజులు,అటెండెన్స్ పేరుతో దోపిడీ..సంగారెడ్డి జిల్లాలో మెడిసిన్ స్టూడెంట్స్ ధర్నా
(సరస్వతి నిలయాల్లో సమస్యలు)
Sangareddy: తెలంగాణలోని పలు సరస్వతి నిలయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు స్టూడెంట్స్. బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ తరహాలోనే డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేడీ స్టూడెంట్స్ సైతం యాజమాన్యం తీరును ఎండగడుతూ ఆందోళన చేపట్టారు.
(K.Veeranna,News18,Medak)
మొన్న బాసర(Basara) ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఫ్యాకల్టీలు లేరని, వీసీని నియమించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదంటూ ఆరు రోజుల పాటు ధర్నా చేపట్టారు. ఇది జరిగిన తర్వాత డీచ్పల్లి(Dichapally)లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)స్టూడెండ్స్ సైతం ఇదే తరహా సమస్యలతో ఆందోళనకు దిగారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని వీసీకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న విద్యావ్యవస్థల్లో పరిస్థితి ఇలా ఉంటే సంగారెడ్డిSangareddy జిల్లాలోని ఎమ్ఎన్ఆర్ (MNR)మెడికల్ కాలేజీ (Medical College)యాజమాన్యంపై మండిపడుతూ స్టూడెంట్స్(Students) పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
వివాదాల్లో విద్యాలయాలు..
సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామ శివారులోని ఎమ్మెన్నార్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు.ఫస్ట్ ,సెకండ్ ఈయర్ చదువుతున్న విద్యార్థులు అడ్వాన్స్‌గా ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఆదేశించింది. ఒక్కో విద్యార్థికి రెండు నుంచి మూడు లక్షల చొప్పున ఫైన్లు వేయడంతో ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈవిధంగా అడ్వాన్స్‌గా ఫీజులు చెల్లించమని కట్టని వాళ్లకు ఫైన్లు విధించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కాలేజీ గేటు ముందు భైటాయించారు.
ఫీజులు, ఫైన్ల పేరుతో మెడికల్ కాలేజీ యాజమాన్యం దోపిడీ..
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు రెండో సంవత్సరం ఫీజు ముందుగానే కట్టాలని ఆదేశించిందని విద్యార్ధులు తెలిపారు. అలాగే సెకండ్ ఈయర్ చదువుతున్న విద్యార్థులకు మూడో సంవత్సరం ఫీజు ముందుగానే చెల్లించాలని యాజమాన్యం మొండికేసింది. వీళ్లతో పాటు ఫస్ట్ ఈయర్, సెకండా్ ఈయర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారని మెడిసిన్ స్టూడెంట్స్ మండిపడుతున్నారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్టూడెంట్స్..
ఫీజులు కట్టడానికి ఈ ఏడాది ఆగస్టు 10వ తేది వరకు గడువు ఉన్నప్పటికి మే 10వ తేదీనే లాస్ట్ డేట్ అని గడువు అయిపోయింది కాబట్టి లేట్ ఫీజ్ కట్టమని రోజుకు వెయ్యి రూపాయల చొప్పున విద్యార్థుల నుండి 75 వేల నుండి లక్ష రూపాయల జరిమానా కట్టించుకుంటున్నారు ఎమ్మెన్నార్ కాలేజీ యాజమాన్యం. అంతే కాదు లాస్ట్ ఈయర్ ఫీజు కట్టిన వాళ్ల దగ్గర అటెండెన్స్ పేరుతో తిరిగి ఫీజులు వసూలు చేస్తూ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు స్టూడెంట్స్. ఇదేమిటని స్టూడెంట్స్ అడిగితే ఇంటికి పంపిస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. కాలేజీలో ల్యాబ్ కూడా సరిగా లేదని ..కాలేజీకి, హాస్టల్‌కి కిలో మీటర్ దూరం ఉండటంతో లంచ్ చేసి కాలేజీకి వెళ్లడానికి ఆలస్యం అవుతోందని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా లేట్ అయినందుకు ఐదు నిమిషాలు లేట్ అయితే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 3000 రూపాయలు జరిమానా విధిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విషయాలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా...తమ తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయించినా పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.