(K.Lenin,News18,Adilabad)
మంచిర్యాల జిల్లాలోని మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నీల్వాయి గ్రామంలో పోలీసుల(Police) ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రామగుండం కమిషనరేట్ ఓఎస్డి శరత్ చంద్ర ముఖ్య అతిథిగా హజరై ఈ ఉచిత వైద్య శిబిరాన్ని(Medical Camp) ప్రారంభించారు. వేమన్ పల్లి మండలం కల్లంపల్లి,రాజారాం, సంపుటం, దస్నాపూర్, గొర్లపల్లి, కొత్తకాలనీ, జిల్లెడ, జక్కేపల్లి, బుయ్యారం, రాచర్ల, ముల్కల్పేట్, ముక్కిడిగూడెం, సీతారా, చామనపల్లి, బద్దంపల్లి, బమ్మెనా, ఒడ్డుగూడెం, నాగారం, కేతన్పల్లి, కల్మల్పేట గ్రామాల నుండి సుమారు 2000 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, అవసరాల కోసం, భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు.
ప్రజలకు పోలీసుల సేవలను మరింత చేరువ చేసేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటి పోలీసింగ్ ద్వారా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. పోలీలు ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తూ వారికి అందుబాటులో ఉంటున్నారని అన్నారు. ఈ రోజు నిపుణులైన డాక్టర్ల బృందాన్ని పిలిపించి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
మారుమూల ఉన్న గ్రామాల నుండి ప్రజలు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివాసి గ్రామస్తులకు, మహిళలకు పోలీసులపై ఉన్న సదాభిప్రాయాన్ని, ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందేలా గ్రామస్తుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు.
మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఆదివాసీలను అభివృద్ధి మార్గం వైపు పయనించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఓఎస్డీ తెలిపారు. చదువు, క్రీడల్లో ప్రతిభ కలిగిన యువకులను ప్రోత్సహించడానికి, పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వం తోడుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తమ గ్రామంలో కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలను కోరడమైనది. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి ప్రజలు తమ ప్రశాంతమైన జీవితాన్ని శాంతియుత వాతావరణంలో గడిపేలాగా చూడడమే పోలీసుల ప్రధాన లక్ష్యం అని అన్నారు. అనంతరం వృద్దులకు దుప్పట్లను, యువతకు వాలీబాల్ కిట్లను ఓఎస్డీ పంపిణి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.