మేడారం జాతరకు వెళ్తున్నారా.. ఆర్టీసీ బస్సు ఛార్జీల వివరాలు ఇవీ..

Medaram Jathara : మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ సంస్థ బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది.

news18-telugu
Updated: January 28, 2020, 5:16 PM IST
మేడారం జాతరకు వెళ్తున్నారా.. ఆర్టీసీ బస్సు ఛార్జీల వివరాలు ఇవీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర’’. మేడారంలో జరుగుతున్న ఈ పండుగ కోసం ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది.
ఓ సారి బస్సు ఛార్జీల వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్ నుంచి రూ.440

ఖాజీపేట్ నుంచి రూ.190
హన్మకొండ నుంచి రూ.190
వరంగల్ నుంచి రూ.190


పరకాల నుంచి రూ.190చిట్యాల నుంచి రూ.200
ఘణపురం(ము) నుంచి రూ.140
భూపాలపల్లి నుంచి రూ.180
కాటారం నుంచి రూ.210
కాళేశ్వరం నుంచి రూ.260
సిరోంచ నుంచి రూ.300
ఏటూర్ నాగారం నుంచి రూ.60
కొత్తగూడ నుంచి రూ.240
నర్సంపేట్ నుంచి రూ.190
మహబూబాబాద్ నుంచి రూ.270
తొర్రూర్ నుంచి రూ.280
వర్ధన్నపేట్ నుంచి రూ.230
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రూ.240
జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు.

కాగా, ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది.
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు