ఆ మేడారం జాతర పాటే.. ఆమె జీవితాన్ని మార్చింది..

మేడారం జాతర నేపథ్యంలో పాడిన ఓ పాట యావత్ తెలంగాణ ప్రజలను ఊపేసింది. సమ్మక్క సారక్కల చరిత్రను కళ్లకు కట్టేలా పాడిన కనకవ్వ.. ఆ ఒక్క పాటతో ప్రతీ తెలంగాణ ఇంటికి పరిచయమైపోయింది.

news18-telugu
Updated: February 10, 2020, 6:13 PM IST
ఆ మేడారం జాతర పాటే.. ఆమె జీవితాన్ని మార్చింది..
తెలంగాణ జానపద గాయిని కనకవ్వ( photo courtesy : mictv)
  • Share this:
‘సమ్మక్క సారక్క వీరులా జాతర మన మేడారంలో అడవివాసుల అమరుల జాతర, మూలవాసుల మన్నెం జాతర మన మేడారంలో పచ్చని అడవిలో పవిత్ర జాతర’ అంటూ సాగే పాట యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేసింది. ఆరుపదుల వయస్సు దాటిన ఓ జానపద గాయకురాలు తమ స్వరకంఠంతో 16వ శతాబ్దానికి చెందిన అడవి దేవతలను కీర్తిస్తూ పాడిన పాటతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ వయస్సులో ఏం చేస్తాంలే.. అనుకునే వారందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. మైక్ టీవీ రూపొందిన మేడారం జాతర ప్రత్యేక పాటలో అలరించిన జానపద గాయిని గొట్టె కనకవ్వ. ఆమె పాడిన మేడారం జాతర పాట విడుదలైన వారం రోజుల్లోనే ఏకంగా 5 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు స‌ృష్టించింది. అద్భుతమైన పాటలతో అలరించే మైక్ టీవీ రూపొందించిన ఈ పాట టిక్ టాక్‌తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

medaram, medaram jatara, medara jatara songs, flok songs, telangana flok songs, sammakka sarakka songs, kanakavva songs, కనకవ్వ సాంగ్స్, మేడారం జాతర పాటలు, సమ్మక్క సారక్క పాటలు, సమ్మక్క సారక్క జాతర పాటలు,
కనకవ్వ(photo courtesy : mictv)


కుటుంబ నేపథ్యమంతా వ్యవసాయమే..
కనకవ్వ సొంతూరు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధిపేటలోని అక్కన్నపేట మండలంలోని బొడిగేపల్లి గ్రామం. అయితే కనకవ్వ జానపద గీతాలను అలవోకగా అద్భుతంగా పాడేది. పంట పోలాలు, గ్రామ పరిసరాల్లో తన సోదరితో కలిసి జానపద పాటలను అద్భుతంగా పాడుతున్న సమయంలో కొంతమంది యువకులు ఆ వీడియోలను రికార్డు చేసి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలకు వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ క్రమంలో కనకవ్వ పాడిన పాటల వీడియోను ఆమె సోదరి మైక్ టీవీ నిర్వహించిన పోటీకి పంపారు. అలా మైక్ టీవీ యాజమాన్యం నిర్వహించిన అడిషన్స్‌కి వెళ్లగా 3వేల మందిని దాటుకుని ప్రథమ స్థానంలో నిలిచింది.

మరో ఆరు పాటలను సైతం రికార్డులే..
కనకవ్వను జానపద సహజ గాయినిగా చెప్పొచ్చు. తన తల్లి నుంచి నేర్చుకున్న చరిత్ర పాఠాలను ఆమె పాటల రూపంలోకి మార్చి పాడడం అనేది అద్భుతం. ఒక్క మేడారం పాటే కాకుండా మరో ఆరు పాటలను సైతం ఆమె పాడారు. అవి కూడా మంచి రికార్డులనే సొంతం చేసుకున్నాయనే చెప్పాలి. అందులో ప్రధానంగా ‘గిన్నె రామా, గిన్నె రామా’ అంటూ పాడిన పాటకు అద్భుత స్పందన వచ్చింది. మేడారం జాతర ప్రత్యేక పాటను చింతమళ్ల యాకయ్య(యశ్‌పాల్) రచించిన సాహిత్యం ఒక ఎత్తయితే.. కనకవ్వ వాయిస్ పాటకు అదనపు మైలేజీని తీసుకొచ్చింది.

ఇప్పటికీ పొలంలో పనిచేస్తూనే..64 ఏండ్ల వయస్సులోనూ కనకవ్వ తన భర్తతో కలిసి తనకున్న ఎకరం పొలంలో పంటలు పండిస్తూనే ఉంది. జానపద పాటలను తల్లి నుంచి నేర్చుకోవడంతో పాటు చిన్నతనంలో కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇతరుల నుంచి నేర్చుకున్నానని కనకవ్వ తెలిపింది. తాను పాడిన జానపద పాటలు, మేడారం జాతర పాట వల్ల బయటికి వెళ్లిన సమయంలో అందరూ గుర్తుపడుతుండడం.. నాతో కలిసి ఫొటో దిగుతుండడం ఆనందంగా ఉందని ఆమె చెబుతున్నారు. తన పిల్లలను కష్ట పెట్టడం ఇష్టంలేకే ఇప్పటికీ భర్త, తన కోసం పని చేస్తున్నానని పేర్కొంది. పాటలను పాడడం వల్ల నాకు అమితానందం కలుగుతుంది. అందుకు అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
First published: February 10, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading