Home /News /telangana /

MEDARAM JATARA SHOUD BE ANNOUNCED AS NATIONAL FEST MLC KAVITA DEMANDS CENTRAL GOVT VRY

MLC Kavita : మేడారం జాతరకు జాతీయ హోదా ఏది.. బీజేపీ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ..

మేడారంలో మంత్రి సత్యవతి రాథోడ్

మేడారంలో మంత్రి సత్యవతి రాథోడ్

MLC Kavita : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కవితా బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని ప్రశ్నించారు.

    మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ల ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించి వెంటనే రిజర్వేషన్లు కల్పించాలని ,మరోవైపు మేడారానికి జాతీయ హోదా తెచ్చి , ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ సంధర్బంగా మేడారంకు జాతీయ కల్పించాలని మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జతచేస్తూ ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత ట్విట్ చేశారు. మరోవైపు స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం శ్రీ కేసీఆర్ గారు మొత్తం 332.71 కోట్లను విడుదల చేశారని గుర్తు చేశారు.

    మరోవైపు మేడారం మహా జాతర -2022 కు వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతుల కోసం పనులు శర వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పారిశుధ్యం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టామని, అదనపు సిబ్బంది ఉంటుందని, మాస్క్ లు, శానిటైజర్లు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటాయని, వ్యాక్సిన్ కేంద్రాలు, ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి రోజు రెండుసార్లు ఫాగింగ్ చేస్తామని తెలిపారు. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పిల్ల జాతరల నిర్వహణకు కూడా 2 కోట్ల రూపాయిలు ఇచ్చి, శాశ్వత నిర్మాణాలకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం అన్నారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 16 నుంచి 19వతేదీ వరకు జరిగే సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల మహా జాతర పనులను , రహదారులను పరిశీలించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.

    Khammam : 8000 అప్పుకే.. ఇంటికి తాళం.. రైతన్నలపై సహకార బ్యాంకు అధికారుల జులుం..

    సీఎం కేసిఆర్ గారి ఆదేశాలతో జాతర కోసం కేటాయించిన 75 కోట్ల రూపాయలలో ఈసారి శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక వసతుల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నామని చెప్పారు.ప్రధాన ఆలయం చేరేందుకు అన్ని సీసీ రోడ్లు రూ.13 కోట్లతో చేపడుతున్నాం. జనవరి 31 నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని వివరించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Kalvakuntla Kavitha, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు