Medaram Jatara : నేడు వన ప్రవేశం చేయనున్న వన దేవతలు...

Medaram Jatara 2020 : మూడ్రోజులపాటూ అద్భుతంగా సాగిన మేడారం జాతర ఇవాళ చివరి రోజుకు చేరుకుంది. వన దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.


Updated: February 8, 2020, 7:24 AM IST
Medaram Jatara : నేడు వన ప్రవేశం చేయనున్న వన దేవతలు...
Medaram Jatara : నేడు వన ప్రవేశం చేయనున్న వన దేవతలు... (credit - twitter - Chhotubhai Vasava)
  • Share this:
Medaram Jatara 2020 : అధికారులు అనుకున్నట్లే... ఈ సంవత్సరం మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దారులన్నీ మేడారం వైపు సాగాయి. తాజా లెక్కల ప్రకారం ఇప్పటికే 1.20 కోట్ల మంది వన దేవతల్ని దర్శించుకున్నారు. అక్కడే నాలుగు రోజులుగా ఉండి... అమ్మవార్లను కొలుచుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించున్నారు. బెల్లాన్ని బంగారంగా భావిస్తూ నిలువెత్తున సమర్పించుకున్నారు. ఇక ఈసారి వేడుకలకు సీఎం కేసీఆర్‌తోపాటూ... గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చాలా మంది మంత్రులు, ఇతర పార్టీల రాజకీయ నేతలు తరలివచ్చారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా మరోసారి ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం జాతర రికార్డులు తిరగరాసింది. ఈసారి ప్రత్యేకంగా హెలికాప్టర్ టూర్ల సదుపాయం కల్పించడం కూడా ఈ జాతరను మరో మెట్టు పైకి ఎక్కించింది. అధికారులు అంచనా వేసినట్లు ఈసారి మొత్తం 1.50 కోట్ల మంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరలో ఇవాళ చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మూడ్రోజులపాటూ... పూజలందుకున్న వన దైవాలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు... ఇవాళ తిరిగి తమ వనాలకు వెళ్లిపోబోతున్నారు. అమ్మవార్లను ఘనంగా సాగనంపేందుకు భక్తులు మేడారంలో ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం ఎలా సాగుతుందంటే... ముందుగా... నలుగురు దేవతల పూజారులూ గద్దెల దగ్గర పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం దగ్గర్లోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఇదంతా గద్దెల దగ్గర ఉన్న భక్తులు కళ్లారా చూసేందుకు వీలుంటుంది. ఐతే... బయటి వారు మాత్రం దీన్ని చూసే వీలు లేదు. ఆలయం దాటిన తర్వాత బయటివారిని లోపలికి రానివ్వరు. అందువల్ల ఇంకా ఎవరైనా అమ్మవార్లను దర్శించుకోలేకపోతే... సాయంత్రం లోపే వెళ్లి దర్శించుకుంటే... అమ్మవార్లను అడవిలోకి పంపే ఘట్టాన్ని కళ్లారా చూసి తరించే అవకాశం లభిస్తుంది.
First published: February 8, 2020, 7:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading