హోమ్ /వార్తలు /తెలంగాణ /

Women's Day: మద్యపాన నిషేదంపై ఏకగ్రీవ తీర్మానం .. అమ్మినా, తాగినా జరిమానా..ఎంతంటే

Women's Day: మద్యపాన నిషేదంపై ఏకగ్రీవ తీర్మానం .. అమ్మినా, తాగినా జరిమానా..ఎంతంటే

ALCOHOL BAN

ALCOHOL BAN

Womens Day: ఆ ఊరిలో జనం తాగుడుకు బానిసలై సంసారాలు రోడ్డున పడేసుకుంటున్నారు. ఈ మద్యం పీడ విరగడ కావాలని గ్రామంలోని మహిళలు చేస్తున్న పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

(K.Veeranna,News18,Medak)

మెదక్ (Medak)జిల్లాలో లేచింది మహిళాలోకం. గ్రామంలో మద్యం నిషేదించాలని చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనే మాటను నిజం చేసి చూపించారు. గ్రామంలో బెల్టుల షాపుల పేరుతో విచ్చల విడిగా మద్యం విక్రయిస్తున్నారు. మగవాళ్లు తాగుడుకు బానిసలవడం, భార్యభర్తల మధ్య ఘర్షణలు ఎక్కువ కావడంతో ఎలాగైనా మద్యం విక్రయాలు నిషేధించాలని పట్టుబట్టారు. ఇందులో భాగంగానే మహిళా దినోత్సవం(Women's Day)సందర్భంగా గ్రామసర్పంచ్ సమయంలో ఊరిలో మద్యం విక్రయించకూడదని ఏకగ్రీవ తీర్మానం చేయించారు. తీర్మానాన్ని ఎవరైన ధిక్కరిస్తే మద్యం విక్రయించిన వారికి పదివేలు జరిమానా, తాగిన వాళ్లకు ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాలని తీర్మానించారు.

లేచింది మహిళాలోకం..

మద్యపానం దెబ్బకు నిత్యం కొన్ని ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. పచ్చని కాపురాలు కూలుతున్నాయి. అయినా దాన్ని నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. కాని మెదక్ జిల్లాలోని షేర్‌పల్లి గ్రామానికి చెందిన మహిళలు మాత్రం మహిళా దినోత్సవం రోజున తమ గ్రామంలో మద్యపాన నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. నర్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో బెల్టు షాపుల పేరుతో అడుగడుగున మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన వాళ్లు మద్యానికి బానిసలై రోజూ ఇంట్లో ఆడవాళ్లతో గొడవలు పడటం, డబ్బులు ఖర్చు చేసుకొని , అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానిక మహిళలు అందరు కలిసి మద్యం నిషేధంపై పోరాటం చేస్తూ వచ్చారు. తమ గ్రామంలో బెల్ట్‌ షాపులు తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలే స్వయంగా తీర్మానం చేసుకొని బెల్ట్ షాపులకు అడ్డుకట్ట వేశారు.

మద్యపాన నిషేధంపై తీర్మానం..

గ్రామంలో బెల్టు షాపుల కారణంగా తలెత్తుతున్న ఘర్షణలు, నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ సమక్షంలోనే మద్యం విక్రయించిన వారు 10వేల రూపాయలు జరిమానా చెల్లించాలని..మద్యం తాగిన వాళ్లు 5వేల జరిమానా కట్టాలని తీర్మానం చేశారు.

OMG: వివాహిత ప్రమాదవశాత్తు మృతి కేసులో ట్విస్ట్ ..తన తండ్రే చంపాడని కూతురు కంప్లైంట్

మద్యం అమ్మినా, తాగినా ఫైన్ కట్టాల్సిందే..

అంతే కాదు గ్రామంలోని ప్రతి వీధి, గల్లీలో తిరుగుతూ మద్యం అమ్మిన వాళ్లను పట్టించినా , తాగిన వాళ్లను పట్టించినా జరిమానాలో కొంత నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని బెల్ట్ షాపుల యజమానులకు చెప్పారు. ఎవరైనా మందు అమ్మినట్లుగా తెలిస్తే వారిపై తప్పని సరిగా కఠిన చర్యలు తీసుకుంటామని షెర్పల్లి మహిళలు ముక్తఖంటంతో చెప్పారు.

First published:

Tags: Alcohol, Medak District news, Telangana News

ఉత్తమ కథలు