(K.Veeranna,News18,Medak)
వేద పారాయణ నిలయంగా, చిన్నారులకు జ్ఞానం ప్రసాదించే అక్షరాభ్యాస కేంద్రంగా సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతీ దేవి ఆలయం విరాజిల్లుతోంది. వసంత పంచమి సందర్భంగా రేపు వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆలయ అధికారులు రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల కోసం క్యూ లైన్ బారీకేడ్లు, మంచినీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసాల కోసం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఆలయాల సంగమం 1989 వసంత పంచమి రోజున యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం చేపట్టి 1992లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆలయ పరిసరాల్లో శనేశ్వరాలయం, లక్ష్మీగ ణపతి ఆలయం, స్వయంభూ శంభులింగేశ్వ రాలయం, కల్యాణ వేంకటేశ్వరాలయం, సుబ్ర హ్మణ్యేశ్వరాలయం కొలువుదీరాయి. రూ.4 కోట్లతో కంచి కామకోటి శంకరమఠం, వేద పాఠశాల భవన నిర్మాణ పనులు జరుగు తున్నాయి. 2001లో ప్రారంభమైన సత్రం ద్వారా ఏటా 10 లక్షల చేస్తున్నారు. మంది భక్తులకు అన్నదానం ఏటా వసంత పంచమి రోజున పెద్ద ఎత్తున చిన్నారులు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ప్రత్యేకంగా రూ.4 కోట్ల పైచిలుకు వ్యయంతో మూడు అంతస్తుల అక్షరాభ్యాస మహామండపం సైతం నిర్మించారు.
కొండపైన మెట్ల మార్గంలో సరస్వతిదేవి కొండ దిగువన పార్క్ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శ్రీ కార్యక్రమ వివరాలు వసంత పంచమి రోజున ఉదయం 4 గంటలకు రవా గణపతి పూజ, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంక రభారతి స్వామి ఆధ్వర్యంలో విశేష పంచామృ తాభిషేకం, అలంకార సేవ, 7 గంటలకు పల్లకీ సేవ, గిరిప్రదక్షిణ, చండీహోమం 8.30 గంట లకు భక్తజన సామూహిక లక్ష పుష్పార్చన, అషో ఉత్తర శత సరస్వతీ సూక్త పారాయణం, 11.30 గంటకు 56 రకాల పదార్థాలతో ఛప్పన్ భోగ్, శ్రీవిద్యాజ్యోతి దర్శనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు రంగంపేట పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి చేతుల మీదుగా విద్యార్థులకు జయపట్టాల ప్రధానం, సాంస్కృ తిక కార్యక్రమాలు, రాత్రి 7 గంటలకు శ్రీమా ధవానంద సరస్వతి స్వామి సమక్షంలో ప్రదోష కాల శ్రీచక్ర పూజ చేస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే వర్గల్ క్షేత్రానికి వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికిందరాబాద్ గురుద్వార్ నుంచి ప్రతీ 20 నిమిషాలకో బస్ ఉంది. గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ రూట్లో వర్గల్ క్రాస్ రోడ్డు నుంచి ఆటోలో క్షేత్రానికి చేరుకో వచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.