కేసీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించిన ఎస్పీ చందన దీప్తి... జగన్ బంధువుతో వివాహం...

సీఎం కేసీఆర్‌తో ఎస్పీ చందన దీప్తి(ఫైల్ ఫోటో)

మెదక్ ఎస్పీ చందన దీప్తి ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన వివాహానికి రావాలని ఆహ్వానించారు.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర యువ పోలీస్ అధికారుల్లో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తికి ఇటీవల పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగే ఈ పెళ్లి వేడుక ప్రముఖుల రాకతో అంగరంగ వైభవంగా జరగబోతుందని సమాచారం. ఇందులో భాగంగా ఎస్పీ చందన దీప్తి ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన వివాహానికి రావాలని కోరారు. అక్టోబర్‌లో జరిగే ఈ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.

    మెదక్ ఎస్పీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని.. అయితే తనకు ఇప్పటికే పెళ్లయిందని ఇంటర్నెట్‌లో గాలివార్తలు హల్‌చల్ చేయడం వల్లే తనకు కాబోయేవాడు ఇంతవరకు తనను కలవలేకపోయాడని సరదా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. పెళ్లి గురించి ఇలా కామెంట్స్ చేసిన కొద్దిరోజులకే దీప్తి చందనకు పెళ్లి కుదిరింది. ఏపీ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధుతో ఆమె పెళ్లి జరగనుందని తెలుస్తోంది. చందనకు చేసుకోబోయే వ్యక్తి జగన్‌కి స్వయానా బంధువు కావటంతో రాజకీయవర్గాల్లోనూ ఈ పెళ్లి పట్ల చాలా ఆసక్తి నెలకొంది.
    First published: