హోమ్ /వార్తలు /తెలంగాణ /

Murder Sketch: చనిపోయాడనుకున్న వ్యక్తే హంతకుడు .. ఆ మర్డర్ కేసులో అసలు ట్విస్ట్‌ అదే

Murder Sketch: చనిపోయాడనుకున్న వ్యక్తే హంతకుడు .. ఆ మర్డర్ కేసులో అసలు ట్విస్ట్‌ అదే

Murder Sketch

Murder Sketch

Murder Sketch: మెదక్ జిల్లాలో జరిగిన మర్డర్‌ కేసులో ట్విస్ట్ వీడింది. కారులో సజీవదహనైన వ్యక్తి ధర్మానాయక్ కాదని ..పోలీసులు రాబట్టారు. చనిపోయాడనుకుంటున్న వ్యక్తే హంతకుడని, ప్రధాన నిందితుడని..కేవలం డబ్బు కోసమే ఈ మర్డర్ స్కెచ్ వేసినట్లుగా ఆధారాలతో సహా రాబట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Medak, India

(K.Veeranna,News18,Medak)

మెదక్ (Medak)జిల్లాలో ఈనెల 5వ తేదిన ఓ హత్య హత్య జరిగింది. మృతుడు, నిందితుల వివరాలు తెలియకపోవడంతో పోలీసులు అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసి విచారించారు. చనిపోయిన వ్యక్తి పేరు ధర్మానాయక్(Dharmanayak)అని తెలంగాణ సచివాలయంలో సీనియర్ అసిస్టెంట్‌(Senior Asst)గా పని చేస్తున్నాడని తెలిసింది. స్థానికంగా దొరికిన ఆధారాలు, విచారణలో లభించిన సమాచారంతో కేసులో ట్విస్ట్‌ని చేధించారు పోలీసులు(Pilice). కారులో సజీవదహనైన వ్యక్తి ధర్మానాయక్ కాదని ..బాబు అని రాబట్టారు. చనిపోయాడనుకుంటున్న వ్యక్తే హంతకుడని, ప్రధాన నిందితుడని..కేవలం ఇన్సూరెన్స్‌ (Insurance)డబ్బులు 7.4కోట్ల రూపాయలకే ఈ మర్డర్ స్కెచ్ వేసినట్లుగా ఆధారాలతో సహా రాబట్టారు. ఈకేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లుగా మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శని(Rohini Priyadarshini) వెల్లడించారు.

Crime news: పరువు పోగొట్టుకున్న ప్రభుత్వ టీచర్‌ .. ఛీ ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

సూత్రధారే నిందితుడు..

తెలంగాణ సచివాలయంలో జాబ్ చేస్తున్న ధర్మానాయక్ ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఓ హైడ్రామాకు తెరతీశారు. తాను చనిపోతే వచ్చే ఏడున్నర కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏడాది క్రితమే పక్క ప్లాన్ వేశారు. తనకు లాగానే ఉండి వ్యక్తి కోసం వెదికి పట్టుకున్నారు. బాబు అనే వ్యక్తి ని చంపి కారులో ఉంచి కాల్చారు. విచారణ చేస్తున్న సమయంలో ఇండోర్ పారిపోయాడునిందితుడు ధర్మానాయక్. తిరిగి మెదక్ వస్తుండగా పట్టుకున్నారు.

అసలు ఎలా చేశారంటే..

ఇన్యూరెన్స్ డబ్బులతో పాటు, కారుణ్య నియామకం ద్వారా కుటుంబ సభ్యుల కు ఉద్యోగం వస్తుందనే యాక్సిడెంట్ డ్రామా ఆడిన ధర్మా కుటుంబ సభ్యులు, బందువులు..ధర్మాతో పాటు కుటుంబ సభ్యులను , సహకరించిన బందువులను అరెస్ట్ చేశారు.  ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సంవత్సరం నుంచి చాలా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు.చిట్టీ డబ్బులు తీసుకుని కూడా షేర్ మార్కెట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. దింతో తన పేరు మీద ఉన్న 7.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడాడు ధర్మా. అక్క సునంద, అల్లుడు శ్రీనివాస్, ధర్మా  భార్య నీల, ధర్మా కొడుకు మైనర్ మొత్తం కలిసి ఈ స్కెచ్ వేశారు.

అసలు జరిగింది ఇది..

కేసులో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్లందరిని విచారించి అసలు విషయాలు రాబట్టారు. మొదట ధర్మాలాగా  ఉన్న వ్యక్తి కోసం నాంపల్లి పొలీస్ స్టేషన్ అడ్డా దగ్గర వెతికారు.అక్కడ అంజయ్య అనే వ్యక్తికి పరిచయం చేసుకున్నారు. అతనికి నిజామాబాద్ లో పని ఉందని జనవరి 7న తీసుకెళ్లాడుఅతన్ని ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశారు.అయితే అంజయ్య తాగి వుండటంతో అతన్ని వదిలేసిన ధర్మా, అతని అల్లుడు శ్రీనివాస్ అప్పటికప్పుడు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో బాబు అనే వ్యక్తిని తీసుకుని వచ్చారు. అతనికి గుండు  గీయించడానికి బాసర తీసుకెళ్లారు.గుండు గీయించి ధర్మా బట్టలు అతనికి వేశారు. అతన్ని అదే కారులో వెంకటపూర్ కి తీసుకు వచ్చారు. చెరువు దగ్గరికి రాగానే అతన్ని కారు ముందుకు రమ్మన్నారుఅతను సహకరించకపోవడంతో అతనిపై గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశారు.అతను చనిపోవడంతో కారు ముందు పెట్టి కారును కాలువలోకి తోసేసి పెట్రోల్ పోసి తగల బెట్టారు.

Telangana: ఆ జిల్లాలో ఇక నుండి ఇంటింటికి జియో టాగ్..ఎందుకో తెలుసా..?

శిక్ష తప్పదుగా..

నేరం చేసి ఇన్సూరెన్స్‌ డబ్బులతో హ్యాపీగా ఉందమనుకున్న నిందితుడితో పాటు కుటుంబ సభ్యుల్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అందర్ని కటకటాలవెనక్కి నెట్టారు.

First published:

Tags: Medak District news, Telangana crime news

ఉత్తమ కథలు