eeranna Mahaa, Medak, News18
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో అన్ని పార్టీ అలెర్టయి ఎన్నికల రంగంలో దిగాయి. ఎవరికివారు ఎన్నికల ప్రచారాన్ని తలదన్నేలా ప్రజల్లో దూసుకెళ్తున్నారు. కానీ అదే స్థాయిల్లో అన్ని పార్టీల్లోనూ వర్గపోరు ముదురుతోంది.
ప్రధానంగా.. అధికార పార్టీ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గవిభేదాలు పార్టీకి శరాఘాతంగా మారుతున్నాయి. తాజాగా సంగారెడ్డి (Sangareddy) బీఆర్ఎస్ (BRS) లో గులాబీలు గుబులు పుట్టిస్తున్నారు. సంగారెడ్డి BRS పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.
కొంతకాలంగా BRS కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలోనే ఓ వర్గం ఛైర్పర్సన్ విజయలక్ష్మి తీరుపై ఆందోళనకు దిగిన కౌన్సిలర్లు బినామీ ఉద్యోగుల పేర్లతో పారిశుద్ధ్య విభాగంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని.. ఈ విషయం విచారణలో రుజువైదంటూ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు.
అవినీతికి పాల్పడుతున్నారంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. రాజీనామా చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే ఛైర్పర్సన్ (ZP Chairperson ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ఆరోపణలు, నినాదాలతో మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.
సొంత పార్టీ కౌన్సిలర్లే రాజీనామాకు పట్టుబట్టడంతో.. మనస్తాపానికి గురైన చైర్ పర్సన్ విజయలక్ష్మి సమావేశంలోనే కంటతడి పెట్టుకున్నారు. ఆరోపణలు రుజువు చేయకుంటే కౌన్సిలర్లపై కేసులు పెడతానని హెచ్చరించారు విజయలక్ష్మి.
గత కొన్నాళ్లుగా సంగారెడ్డి మునిసిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండువర్గాలుగా విడిపోయారు. అప్పటినుంచి కారు పార్టీలో వర్గపోరు చాపకింద సాగుతోంది. అది కాస్తా మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశంలో భగ్గుమంది. మొత్తంగా సంగారెడ్డిమున్సిపల్ చైర్మన్ పైబీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతోమొదలైన రాజకీయం జిల్లా మంత్రి హరీష్ రావు (Harish Rao) దృష్టికి కౌన్సిలర్లు తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. మరి ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Local News, Medak, Sangareddy, Telangana