హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy: ఆ పరిశ్రమల్లోనే పేలుళ్లు..ఏటా వంద మందిపైగా మృతి

Sangareddy: ఆ పరిశ్రమల్లోనే పేలుళ్లు..ఏటా వంద మందిపైగా మృతి

(పరిశ్రమల్లో ప్రమాదాలు)

(పరిశ్రమల్లో ప్రమాదాలు)

Sangareddy:పరిశ్రమలు ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. పది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికి ఉద్యోగుల భద్రత ప్రమాణాలు పాటించకపోవడం కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న రసాయ, ఇనుము పరిశ్రమలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో పరిశ్రమలు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఉపాధి కోసం ఊర్లు, రాష్ట్రాలు వదిలి వలస వచ్చిన కార్మికులు స్టీల్‌ పరిశ్రమ(Steel industry)లో రియాక్టర్లు(Reactors) ఫర్నెస్‌(Furnaces), లు పేలడంతో మృత్యువాతపడుతున్నారు. బొల్లారం(Bollaram)మీనాకి స్టీల్ ఫ్యాక్టరీ(Meenaki Steel Factory)లో ఈనెల 4న జరిగిన పేలుడు ప్రమాదంలో కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీహర్(Bihar)వాసి అక్షయ్ కుమార్ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన రోజు ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మరణించగా.. సోమవారం (Monday)అక్షయ్(Akshay Kumar)కుమార్ మృతితో ఆ సంఖ్య మూడుకు చేరింది. ఈతరహా ప్రమాదాలు పదే పదే జరుగుతున్నా...వందలాది కార్మికుడు మృత్యువాత పడుతున్నప్పటికి పరిశ్రమల యాజమాన్యాలు మృతుడి కుటుంబనికి  పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి.

ఏడాదికి 50నుంచి 100మంది..

కనీసం ఏడాదిలో కనీసం 75నుంచి 100మంది వరకు చనిపోతున్నట్లుగా ఫైర్ అధికారులు చెబుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కార్మిక కుటుంబాలు ఇలాంటి ఘటనలతో ఆందోళన చెంది.. సొంతూరుకు తిరిగి పయనమయ్యే దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తుండగా..కొన్ని బయటకు రావడం లేదు. ఏటా ప్రమాదాల శాతం జీరోకు చేరుకోవాలని కర్మాగారాల భద్రతా శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికి అది సాధ్యపడటం లేదు. గతేడాది సైతం ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈసారైనా పకడ్బందీగా నిర్వహించాలని కార్మికులు కోరుతున్నారు.

ఉపాధి కోసం వచ్చి ఊపిరి వదులుతున్నారు..

రసాయన, ఇనుము పరిశ్రమల్లోనే ప్రమాదాల నివారణే లక్ష్యంగా పరిపాలనాధికారి హనుమంతరావు జిల్లా పరిధిలో రెండు కమిటీలను నియమించారు. కార్మిక, పరిశ్రమల, కర్మాగారాల భద్రతా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక కేంద్రాలకు చెందిన అధికారులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ బృందాలు ప్రస్తుతం రసాయన, ఇనుము తయారీ యూనిట్లేసవరించుకోవాల్సిన అంశాలను వివరిస్తున్నాయి. ప్రధానంగా రసాయన, ఇనుము తయారీ యూనిట్లలోఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రియాక్టర్లు, బాయిలర్లు పేలడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆయా కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కమిటీలు సూచిస్తున్నాయి.

(ఆ పరిశ్రమల్లోనే పేలుళ్లు)
(ఆ పరిశ్రమల్లోనే పేలుళ్లు)

భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే..

జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను పరిశీలించిన అనంతరం కమిటీ ఏ పరిశ్రమలో ఎలాంటి పరిస్థితి నెలకొందో నివేదిక ఉన్నతాధికారులకు అందచేయనున్నాయి. దీంతో పాటు.. మాక్ డ్రిల్ నిర్వహిస్తూ.. ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలో, నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి కాంట్రాక్ట్ పద్దతిలో, తాత్కాలిక ఉద్యోగులుగా తక్కువ జీతాలకే పనిచేస్తుండటం కారణంగా భద్రతా పరికరాలను అంతగా పట్టించుకోక పోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

పరిశ్రమల్లో చర్యలు..

ముఖ్యంగా ఇనుము పరిశ్రమల్లోని ఫర్నేస్ (కొలిమి) వద్ద ఎక్కువ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్థానికులు ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఒడిశా, బిహ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినకార్మికులను నియమించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 7,500 వరకు పరిశ్రమలున్నాయి. వీటిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నవి రెండు వేల వరకు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లోని లోపాలను పరిశీలిస్తున్నారు. తనిఖీలు పకడ్బందీగా నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తేనే మంచి ఫలితాలు సాధ్యమని పలువురు సూచిస్తున్నారు. జిన్నారం మండలంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవటంతో బొల్లారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవిస్తే రూ.కోట్ల విలువైన ఆస్తి బుగ్గిపాలవుతోంది. ఈ సమస్యపై కమిటీ ప్రత్యేకంగా సారించాలని పారిశ్రామికవేత్తలు, స్థానికులు కోరుతున్నారు. పారిశ్రామికవాడలో అధునాతన ప్రభుత్వ వైద్యశాలను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స అందించడానికి వీలవుతుందంటున్నారు.

First published:

Tags: Fire Accident, Sangareddy

ఉత్తమ కథలు