హోమ్ /వార్తలు /తెలంగాణ /

Innovative school: వావ్​.. వాట్​ ఏ ఐడియా.. స్కూల్​లో చేతులకు గోరింటాకు పెట్టి పాఠాలు చెబుతున్న టీచర్​.. ఎందుకంటే..?

Innovative school: వావ్​.. వాట్​ ఏ ఐడియా.. స్కూల్​లో చేతులకు గోరింటాకు పెట్టి పాఠాలు చెబుతున్న టీచర్​.. ఎందుకంటే..?

గోరింటాకు

గోరింటాకు

ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోగల నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని ముశ్రిఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గోరింటాకు ఉత్సాహాన్ని విజ్ఞాన సంబురంగా మార్చుకున్నారు.

  (Sayyad rafi, News18, Mahbubnagar)

  ఆషాఢ మాసం (Ashada Masam) అనగానే ఆడపడుచులు కొత్త  ఉత్సాహంగా ఉంటారు. ఆషాఢ మాసంలో ఆడపడుచుల చేతులు ఎర్రబడతాయి. ఆషాఢ మాసంలో గోరింటాకు వేడుకకు ప్రత్యేకత ఉంటుంది. యువతులు మహిళలు అందరూ గోరింటాకు పెట్టుకొని ఆరోజు పండుగలా చేసుకుంటారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar) పరిధిలోగల నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని ముశ్రిఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గోరింటాకు  (Henna) ఉత్సాహాన్ని విజ్ఞాన సంబురంగా మార్చుకున్నారు. సైన్స్ లోని పాఠ్యాంశాల బొమ్మలను గోరింటాకుతో చేతులకు పెట్టుకుని ఆ బొమ్మల గురించి తరగతి గదిలో బోధిస్తూ (Teaching)  పాఠాలను వినూత్నంగా నేర్చుకుంటున్నారు. విద్యార్థులు (Students) ఇలా చేయడం ద్వారా పాఠ్యంశాలు మనసుకు హత్తుకు పోతాయని సైన్స్ ఉపాధ్యాయుడు మల్లేశం తెలిపారు. దానితోపాటు మన సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగి ఉన్న సైన్స్ కూడా విద్యార్థులకు బోధించవచ్చని తెలుపుతున్నారు.

  సైన్స్ సబ్జెక్టులోని చిత్రాలతో..

  ఏటా ఆషాఢ మాసంలో మహిళలు నిర్వహించుకునే గోరింటాకు వేడుకను విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలు సులభతరంగా బోధించేలా ఉపాధ్యాయుడు మల్లేశం (Teacher Mallesham) చేసిన వినూత్న ఆలోచన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. 8 .9వ తరగతి విద్యార్థులు తమ తమ పాఠశాల లోని సైన్స్ సబ్జెక్టులోని గుండె కన్ను ఊపిరితిత్తులు మెదడు తదితర శరీర భాగాల చిత్రాలు, వృక్ష జంతు కణ నిర్మాణాలు హరిత రేణువులు బ్యాక్టీరియా వైరస్ శైవలాలు శిలీంద్రాలు వంటి సూక్ష్మజీవుల చిత్రాలను  (Diagrams) గోరింటాకుతో చేతులకు పెట్టుకున్నారు. విద్యార్థులు తరగతి గదిలో ఒక్క అంశం గురించి చేతులపై గోరింటాకు డిజైన్తో బోధిస్తూ విద్యార్థులకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా వినూత్న బోధనకు ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఈ వినూత్న విధానం ఎంతో బాగుందని సంతోషంగా చెబుతున్నారు. వారి అభిప్రాయాలు న్యూస్ 18 తో ఇలా పంచుకున్నారు..

  గోరింటాకు పండుగ బాగుంది : శివలీల విద్యార్థిని..

  మా పాఠశాలలో ఇటీవల గోరింటాకు పండుగను వినూత్నంగా జరుపుకున్నాం. ఉపాధ్యాయుల సహకారంతో సైన్స్ సబ్జెక్టులోని పాఠ్యాంశాలను వారిలో ఉన్న చిత్రాలను చేతులపై వేసుకొని అవగాహన పొందుతూ తోటి విద్యార్థులకు వివరించాం. ఇలా పండుగ సంబరాలను ఎంతో ఆనందంగా జరుపుకున్నాం. అదే స్థాయిలో పాఠంశాలను చర్చించుకున్నాము.

  చిత్రాలు గీయడంతో నైపుణ్యం..:  లక్ష్మి, విద్యార్థిని.

  పాఠశాలలోని ముఖ్యమైన చిత్రాలను గీయడంలో నైపుణ్యం పొందాం. చేతులపై బొమ్మల ఆకృతిలో గోరింటాకు పెట్టుకోవడం ఎంతో సరదాగా అనిపించింది. చిత్రంలోని భాగాలు వాటి విధుల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. సబ్జెక్టులోని అంశాలను సులభంగా అర్థం చేసుకోగలిగాం. ఇది మాకెంతో ఉపయోగపడుతుంది

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Mahbubnagar, School, Students, Teaching

  ఉత్తమ కథలు