మళ్లీ పోతే ఈ అవకాశం రాదు.. ఆ పనికి సహకరించాలన్న జీహెచ్ఎంసీ మేయర్

టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటున్న జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్

పనులన్నింటినీ ఒక దశకు తెచ్చేందుకు లాక్‌డౌన్ మంచి అవకాశమని, ఇలాంటి అవకాశం పోతే మళ్లీ రాదని చెప్పారు.

  • Share this:
    బాలానగర్ ఫ్లైఓవర్ పనులను వేగంగా పూర్తి చేసేందుకు భూసేకరణకు సహకరించాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నగరవాసులను కోరారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని, అక్కడక్కడ కొంతమంది యజమానులు చెబుతున్న అభ్యంతరాల వల్ల పనులను సమగ్రంగా చేపట్టలేకపోతున్నామని మేయర్ తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సీసీపీ దేవేందర్ రెడ్డిలతో కలిసి సంబంధిత ఆస్తుల యాజమానులతో భూసేకరణ, టీడీఆర్ జారీ గురించి చర్చించారు. పనులన్నింటినీ ఒక దశకు తెచ్చేందుకు లాక్‌డౌన్ మంచి అవకాశమని, ఇలాంటి అవకాశం పోతే మళ్లీ రాదని చెప్పారు. బాలానగర్ రహదారి 24 గంటలు రద్దీగా ఉంటుందని, లాక్‌డౌన్ తర్వాత ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టమని తెలిపారు. అలాగే భూసేకరణ తర్వాత మిగిలిన ఆస్తులు, నిర్మాణాలను సరిచేసుకునేందుకు ఇప్పుడే సౌకర్యవంతంగా ఉంటుందని మేయర్ చెప్పారు.
    Published by:Narsimha Badhini
    First published: