హోమ్ /వార్తలు /తెలంగాణ /

Koti Fire Accident: కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. 6 బట్టల దుకాణాలు దగ్ధం

Koti Fire Accident: కోఠిలో భారీ అగ్నిప్రమాదం.. 6 బట్టల దుకాణాలు దగ్ధం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Koti Fire Accident: మంటల్లో తగులబడుతున్న దుకాణాలను చూసి యజమానులు కంటతడి పెట్టారు. కొందరైతే లోపలికి వెళ్లి క్యాష్ కౌంటర్ నుంచి నగదు, బట్టలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ అగ్నికీలల్లో చిక్కుకుంటే ప్రమాదమని.. ప్రాణాలు పోతాయని పోలీసులు నచ్చజెప్పారు.

ఇంకా చదవండి ...

  హైదరాబాద్‌లోని బిజీ ఏరియాల్లో కోఠి ఒకటి. అన్ని రకాల వ్యాపార సముదాయాలు అక్కడ ఉన్నాయి. అలాంటి రద్దీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద శనివారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట ఓ బట్టల షాపులో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దుకాణం నిండా దుస్తులే ఉండడంతో క్షణాల్లోనే అంతటా మంటలు విస్తరించాయి. అంతేకాదు ఆ షాపు నుంచి చుట్టుపక్కల షాపులకు కూడా వ్యాపించాయి. రాత్రి వేళ దుకాణాలు మూసివేసి అందరూ ఇంటిక వెళ్లిన తర్వాత.. ఈ ఘటన జరిగింది. చుట్టు పక్కల ప్రజలు.. పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్లు చేరుకొని మంటలను అదుపుచేశాయి.

  మంటల్లో తగులబడుతున్న దుకాణాలను చూసి యజమానులు కంటతడి పెట్టారు. కొందరైతే లోపలికి వెళ్లి క్యాష్ కౌంటర్ నుంచి నగదు, బట్టలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ అగ్నికీలల్లో చిక్కుకుంటే ప్రమాదమని.. ప్రాణాలు పోతాయని పోలీసులు నచ్చజెప్పారు. వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఐతే ప్రమాద సమయంలో లోపల సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ అదే ప్రమాదం పగటివేళ జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో దుకాణాల్లోని బట్టలన్నీ కాలి బూడిదవడంతో కోట్లలో నష్టం జరిగినట్లు చెప్పారు.

  అగ్రిప్రమాదం కారణంగా శనివారం రాత్రి కోఠిలోని ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలు ఎగిసిపడడంతో వాహనాదారులను అటు వైపునకు అనుమతించలేదు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో సుమారు 5 గంటలకు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడ బట్టల షాపులను నిర్వహిస్తామని.. ఈ ప్రమాదంతో సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Fire Accident, Hyderabad, Telangana