హోమ్ /వార్తలు /తెలంగాణ /

Fire Accident Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 ఫైరింజన్ల సాయంతో..

Fire Accident Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 ఫైరింజన్ల సాయంతో..

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్దరాత్రి వేళ ఓ గోదాములో చెలరేగిన మంటలు.. మరో నాలుగు గోదాములకు వ్యాపించాయి.

  హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలో అర్దరాత్రి చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభివించింది. తొలుత బహదూర్‌పురలోని ఓ ట్రాన్స్‌పోర్టు గోదాములో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గోదాములో బొగ్గు నిల్వ ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు మరో నాలుగు గోదాములకు వ్యాపించాయి. అర్ధరాత్రి కావడంతో మంటల తీవ్రత పెరిగేవరకు ఎవరూ గమనించలేదు. స్థానికులు మంటలను గుర్తించేసరికి మంటలు వేగంగా వ్యాప్తిచెందాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరకున్నారు. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని సమాయక చర్యలు చేపట్టారు.

  నగర పోలీసు సంయుక్త కమిషనర్‌ తరుణ్‌ జోషి, హైదరాబాద్‌ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తంగా ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం జరిగిన్టు వెల్లడించారు.

  Hyderabad: ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది కదా అని యాక్సెప్ట్ చేస్తే.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి..

  Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. భార్య, భర్తలే కీలకం.. అసలు ట్విస్ట్ ఏమిటంటే..

  Hyderabad: మహిళకు యువకుడి నుంచి ఫోన్ కాల్స్.. తీరా ఆమే ఫోన్ చేసి ఇంటికి పిలవడంతో..

  ఇక, అగ్ని ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో తమకు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని గోదాముల యజమానులు తెలిపారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Fire Accident, Hyderabad

  ఉత్తమ కథలు