Home /News /telangana /

MASK MUST IN SEVERAL STATES IN INDIA DUE TO COVID 19 POSITIVE CASES INCREASE PCV

Covid 19 Mask : మాస్క్ లేదా.. వెయ్యి కట్టు..! పక్క రాష్ట్రాల్లో తాట తీస్తున్నారు!

అందరూ అలర్ట్ గా ఉండాల్సిందేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్న సమయంలో విధిగా మాస్క్ పెట్టుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.

అందరూ అలర్ట్ గా ఉండాల్సిందేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్న సమయంలో విధిగా మాస్క్ పెట్టుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.

అందరూ అలర్ట్ గా ఉండాల్సిందేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్న సమయంలో విధిగా మాస్క్ పెట్టుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.

    Covid 19 Mask : కొన్నినెలలుగా సైలెంట్ గా ఉన్న కరోనా మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వేగంగా కరోనా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. దీంతో.. రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

    తెలంగాణలో వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ అలర్ట్ గా ఉండాల్సిందేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జూన్ 29న హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్న సమయంలో విధిగా మాస్క్ పెట్టుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.  మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధింపు నిబంధన ఇప్పటికే అమలులో ఉందని గుర్తుచేశారు. ఎవరు మాస్క్ పెట్టుకోకపోయినా.. ఈ రూల్ ప్రకారం వారికి ఫైన్ విధిస్తారని హెచ్చరించారు.

    తెలంగాణ మాత్రమే కాదు.. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మాస్క్ ను మస్ట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకపోతే రూ.250 ఫైన్ విధిస్తామని కర్ణాటక హెల్త్ కమిషనర్ డి. రణదీప్ ప్రకటన జారీచేశారు. గడిచిన వారం రోజుల్లో కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల కనిపించడంతో.. అధికారులు జనానికి అలర్ట్ ఇచ్చారు.



    తమిళనాడు, కేరళలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ హెచ్చరికలను జనం పెద్దగా పాటించకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. జంక్షన్లు, కూడళ్లలో.. ట్రాఫిక్, సివిల్ పోలీసులు మాస్క్ పై అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ లేని వారికి ఫైన్ల గురించి హెచ్చరిస్తూ మాస్కులు అందిస్తారు. అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ మాస్క్ నిబంధన అమలులోకి వచ్చింది. 2020 మార్చి నుంచి దేశంలో మాస్కుల జమానా మొదలైంది. ఇప్పటికే 3 వేవ్ లు చూసిన దేశం..కేసుల సంఖ్యలో మరో పీక్ ను చూడబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
    Published by:V. Parameshawara Chary
    First published:

    Tags: Corona mask, Covid 19 restrictions, Health care, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు