పెద్దపల్లి జిల్లాలో అమర జవాన్ శ్రీనివాస్‌కు అంతిమ వీడ్కోలు...

శ్రీనివాస్ (File)

శ్రీనివాస్ కుటుంబానికి 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం తో పాటు శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.

  • Share this:
    పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపెల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సాలిగం శ్రీనివాస్ జమ్మూకాశ్మీర్ లో రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు శ్రీనివాస్ మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. శ్రీనివాస్ మిత్రులు, బంధువులు, గ్రామ ప్రజలు కమాన్పూర్ గ్రామం నుంచి సుమారు పదిహేను కిలోమీటర్లు బైక్ ర్యాలీలతో భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ నాగేపల్లి గ్రామానికి తీసుకువచ్చారు. ప్రజలు భారీ సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీనివాస్ పార్థీవ దేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బిజెపి మంథని ఇన్చార్జ్ సనత్ కుమార్, ఆర్మీ జవాన్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ ది పేద కుటుంబమని, వారికి 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం తో పాటు శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అండగా ఉండాల్సిన పెద్దకొడుకు మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య ఆర్మీ జవాన్ శ్రీనివాస్ అంతిమయాత్ర సాగింది. 2013లో ఆర్మీలో చేరిన శ్రీనివాస్‌కు రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: