Video | రేపు సూర్యాపేటలో ఆవిష్కరించే కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ఇదే...

Colonel Santosh Babu | తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏకే ఆర్ట్స్ సంస్థ 48 గంటల్లో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సిద్ధం చేేసింది.

news18-telugu
Updated: June 25, 2020, 10:32 PM IST
Video | రేపు సూర్యాపేటలో ఆవిష్కరించే కల్నల్ సంతోష్ బాబు విగ్రహం ఇదే...
కల్నల్ సంతోష్ బాబు విగ్రహం
  • Share this:
(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

అమ‌ర‌వీరుడు కల్నల్ సంతోష్ బాబు త్యాగానికి భార‌త‌దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డింది. భార‌తీయులంద‌రూ చివ‌రిసారిగా ఆ అమ‌ర‌వీరుడికి వీడ్కోలు ప‌లికారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌తో పాటు దేశవాసులు అందరూ కూడా ఆ కుటుంబానికి బాస‌ట‌గా నిలిచారు. సంతోష్ బాబుకు మ‌ర‌ణ‌మ‌నేది లేద‌ని బార‌తీయుల గుండెల్లో ఎప్ప‌టికి ఆయ‌న త్యాగం అలానే ఉంటుంద‌ని కోనియాడారు. ఇదిలా ఉంటే సంతోష్ బాబు విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డానికి స‌ర్వం సిద్దం చేశారు ఆయ‌న చిన్న‌నాటి మిత్రులు. ఇందులో భాగంగా సంతోష్ బాబు విగ్ర‌హాన్ని చెక్కే బాధ్య‌త‌ను ప్ర‌ముఖ శిల్పి అరుణ్ ప్ర‌సాద్ కి అప్ప‌గించారు. తూర్పుగోదావ‌రికి చెందిన అరుణ్ గ‌తంలో ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ రామారావు హయాంలో ఏర్పాటు చేసిన శిల్పాల‌ను చెక్క‌ారు. ఇప్పుడు ఆయ‌న సంతోష్ బాబు శిల్పాన్ని కూడా చెక్కారు. కేవ‌లం 48 గంట‌ల్లోనే సంతోష్ బాబు విగ్రహానికి ఒక రూపం ఇచ్చారు. ఏకే ఆర్ట్స్ సంస్థ రూపొందించిన సంతోష్ బాబు విగ్ర‌హం శుక్ర‌వారం సూర్య‌పేట బ‌స్టాండ్ స‌మీపంలో ఆవిష్క‌రించ‌నున్నారు.


“భార‌త్- చైనా స‌రిహద్దులో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు విగ్ర‌హం రూపొందించే అవ‌కాశం మా సంస్థ‌కు రావ‌డం చాలా గ‌ర్వ‌కార‌ణంగా ఉంది. ఈ శిల్పాన్ని కేవ‌లం రెండురోజుల్లోనే పూర్తి చేశాం. సంతోష్ బాబు కు చెందిన కొంత మంది చిన్న నాటి స్నేహితులు ఈ శిల్పాన్ని చెక్క‌ాల‌ని మా వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వ‌ర్క్ అన్ని ఆపేసి యుద్ద‌ప్ర‌తిపాదిక‌న ఈ శిల్పాన్ని చెక్కాం.” అని అరుణ్ న్యూస్ 18 తో చెప్పారు.
First published: June 25, 2020, 10:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading