హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana:పెళ్లి రోజునాడే నూరేళ్లు నిండాయి..పాలకూర కోసం వెళితే..

Telangana:పెళ్లి రోజునాడే నూరేళ్లు నిండాయి..పాలకూర కోసం వెళితే..

(పెళ్లి రోజునే దుర్మరణం)

(పెళ్లి రోజునే దుర్మరణం)

Road Accident:పెళ్లి రోజునాడే ఆమెకు నిండు నూరేళ్లు నిండాయి. భర్త,పిల్లలతో గుడికి వెళ్లాలనుకుంటే మృత్యువు రోడ్డు ప్రమాదంలో రూపంలో వెంటాడింది. పదో పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న ఆమె కుటుంబ సభ్యులకు కన్నీరు మిగిలింది.

మ్యారేజ్‌ డే (Marriage‌ Day)రోజున ఆ మహిళకు నిండు నూరేళ్లు నిండాయి. పెళ్లి రోజున ఇంట్లో పనులు త్వరగా పూర్తి చేసుకొని భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. విధి విక్రించడంతో మ్యారేజ్‌ డే రోజునే ఆ గృహిణి శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు చేరుకుంది. ఇంట్లో వేడుకలు జరుపుకొని సందడి చేద్దామనుకున్న కుటుంబ సభ్యులు వివాహిత దుర్మరణంతో విషాదంలో మునిగిపోయారు. నల్లగొండ(Nallagonda)జిల్లా తిరుమలగిరి (Thirumalagiri) మండలం తొండ గ్రామంలో ఈ హృదయవిదారక దృశ్యం చోటుచేసుకుంది. మృతురాలు రేణుక( Renuka)ఇంటి ఎదురుగా ఉన్న షాపు దగ్గర ఆకు కూరలు తీసుకొని రోడ్డు దాటుతుండగా సెప్టిక్ ట్యాంకర్ (Septic tanker)ఢీకొంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రి(Private hospital)కి తరలిస్తుండగా మృతి చెందింది. రేణుక మరణవార్త విని తట్టుకోలేకపోయిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తిరుమలగిరి మండలం తాటిపాముల(Tatipamula)గ్రామానికి చెందిన రేణుకకు 9సంవత్సరాల క్రితం తొండ గ్రామానికి చెందిన లోడె శేఖర్‌(Lode Shekhar)తో వివాహం జరిగింది. రేణుకకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

పెళ్లి రోజునాడే చావు..

వివాహం జరిగి 9సంవత్సరాలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులు రేణుకతో పాటు అందరూ కలిసి యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి దర్శనానికి వెళ్లిరావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగనే త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకునే క్రమంలో దుర్ఘటన జరగడం స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది. వివాహం జరిగి పదో ఏట అడుగుపెడుతున్న వివాహితకు నిండు నూరేళ్లు నిండిపోవడంతో భర్త, ఇద్దరు కుమార్తెలు బోరున విలపించారు. అప్పటి వరకు సరదాగా, సందడిగా ఉన్న ఇల్లు కాస్తా రేణుక మరణంతో విషాదం నెలకొంది.

వివాహితను వెంటాడిన మృత్యువు..

ఆకు కూరలు తెచ్చుకునేందుకు ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు అవతలికి వెళ్లి వస్తున్న రేణుకను తొర్రూరు నుంచి వేగంగా వస్తున్న సెప్టిక్ ట్యాంక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే చనిపోయింది. జరిగిన ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని భర్త శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రేణుక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నిర్లక్ష్యమే కారణం ..

సెప్టిక్ ట్యాంకర్‌ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వివాహితురాలు దుర్మరణం చెందడం స్థానికంగా కలకలం రేపింది. రేణుక మృతితో ఆ ఇంట్లో భార్యను కోల్పోయిన శేఖర్, తల్లిని కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలు, కోడల్ని దూరం చేసుకున్న అత్తమామలు పడుతున్న వేదన మాటల్లో వర్ణించలేనిది.

First published:

Tags: Nalgonda, Road accident

ఉత్తమ కథలు