హోమ్ /వార్తలు /telangana /

Nizamabad : యువతులారా జాగ్రత్త.. తన ఇంటిముందే భర్త కావాలంటూ ధర్నా చేపట్టింది.. ఎందుకంటే...!

Nizamabad : యువతులారా జాగ్రత్త.. తన ఇంటిముందే భర్త కావాలంటూ ధర్నా చేపట్టింది.. ఎందుకంటే...!

Nizamabad : వయస్సులో ఉన్నప్పుడు కులమతాలు అడ్డురాలేదు.. కులాంతర వివాహాం చేసుకుని ఓ బిడ్డను కన్న తర్వాత అప్పుడు పట్టింపులకు వెళ్లాడు.. కట్ చేస్తే తనకు ఆమె వద్దంటూ మరో పెళ్లికి సిద్దమయ్యాడు.

Nizamabad : వయస్సులో ఉన్నప్పుడు కులమతాలు అడ్డురాలేదు.. కులాంతర వివాహాం చేసుకుని ఓ బిడ్డను కన్న తర్వాత అప్పుడు పట్టింపులకు వెళ్లాడు.. కట్ చేస్తే తనకు ఆమె వద్దంటూ మరో పెళ్లికి సిద్దమయ్యాడు.

Nizamabad : వయస్సులో ఉన్నప్పుడు కులమతాలు అడ్డురాలేదు.. కులాంతర వివాహాం చేసుకుని ఓ బిడ్డను కన్న తర్వాత అప్పుడు పట్టింపులకు వెళ్లాడు.. కట్ చేస్తే తనకు ఆమె వద్దంటూ మరో పెళ్లికి సిద్దమయ్యాడు.

    ( Mahender news 18 Telugu Nizamabad )

    ప్రేమ పెళ్లిలు జీవితకాలం అన్యోన్యంగా ఎలాంటీ ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయనేది చరిత్రగా నే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇప్పుడు ప్రేమ పెళ్లిలైనా... సాంప్రదాయకంగా తల్లి దండ్రులు చూసి చేసిన పెళ్లిలు అయినా.. వారి బంధం మధ్యలోనే తెగిపోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లలను కూడా కన్న తర్వాత మగాళ్ల మనసు మారుతోంది. దీంతో ఏ పెళ్లిలు కూడా జీవిత కాలం నిలిచేందుకు అవకాశం లేకుండా పోతున్నాయి. ఇలా ఓ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఓ బిడ్డ పుట్టిన తర్వాత తనకు వద్దంటూ మరో యువతితో పెళ్లి సిద్దమవుతుండగా ఓ భార్య న్యాయపోరాటానికి దిగింది.. భర్త ఇంటి ముందే పుట్టిన పిల్లాడితో కలిసి ధర్నా చేపట్టింది.

    వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామానికి చెందిన ఆకుల శివ కృష్ణ ( మున్నురు కాపు ) పక్క గ్రామమైన నాగరం కు చెందిన దళిత యువతి స్వాతి  ఇద్ద‌రు ప్రేమించుకున్నారు..  డిగ్రీ చదువుతున్న సమయంలో వీరిద్ద‌రి మ‌ద్య ప్రేమ చిగురించింది.. చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.. యువ‌తి త‌ర‌పు త‌ల్లితో పాటు కుల స‌భ్యుల‌కు చెప్పి వారి అంగీకారంతో  ప్రేమించిన శివ కృష్ణ‌ను పెళ్లి చేసుకుంది.. అయితే శివకృష్ణ అన్న‌కు పెళ్లి కాలేద‌ని వారి ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప కుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్ లో 2019 లో వివాహం చేసుకున్నారు..

    Khammam : ముందుగా మర్యాద రామన్న ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మాములుగా లేదు కథ..

    అనంతరం హైదరాబాద్ కు వెళ్లిపోయారు.. రెండేళ్లు కాపురం చేసారు.. వీరి ప్రేమ‌కు ప్ర‌తిరూపంగా పండంటి బాబు జ‌న్మించారు.. బాబు పుట్టిన త‌రువాత శివకృష్ణ తన అసలు స్వరూపం చూపించాడు.. భార్యతో శారీరక సంబంధం అవసరం తీరిన తర్వాత ఆమెను కాద‌ని మ‌రో అమ్మాయితో శారీరక సంబందం పెట్టుకున్నాడు.. ఇక స్వాతి డెలివరి కోసం ఆసుపత్రికి వెళ్లిన తర్వాత తాను డబ్బులు పట్టుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. అప్పటి నుండి ఇక తిరిగి ఆసుపత్రి వైపు కూడా చూడలేదు. చేసేది లేక తల్లిదండ్రులే ఆసుపత్రి ఖర్చులు చెల్లించి ఆమె ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత కూడా భార్యతో పాటు పుట్టిన బిడ్డను కూడా సరిగా చూసుకోకపోవడంతో ఆమెతో ఇష్టం లేనట్టుగా వ్యవహరించాడు. దీంతో పాటు ఆమె మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని చూస్తున్న శివకృష్ణ భార్యను వదలించుకోవాలని యత్నిస్తున్నాడు.

    Khammam : ఖమ్మంలో విషాదం.. క్రికెట్ ఆడుతుంటే.. చెట్టు కూలి ఇద్దరు మృతి..

    దీంతో విషయం తెలిసిన స్వాతి కులాంతర వివాహం చేసుకున్నాంటు ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె రోడ్డున పడింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందే ధర్నా చేపట్టింది. తన బిడ్డకు తండ్రితో పాటు నా భర్త నాకు కావాలంటూ వేడుకోంటుంది. దీంతో స్వాతికి కుల సంఘాల మద్దతు ప్రకటించారు. మరి శివకృష్ణ పై ఒత్తిడి తెచ్చి ఇద్దరిని ఒక్కటి చేయాలని కులసంఘాలు భావిస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు