నిజామాబాద్ జిల్లా,
తేది :10-06-2021,
న్యూస్ 18తెలుగు ప్రతినిధి :పి మహేందర్,
ప్రేమించుకోవడం..తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకోవడం.. లేదా తల్లి దండ్రులు కాదంటే ఇద్దరు వెళ్లి ఆత్మహత్య చేసుకునే ట్రెండ్ ఇప్పుడు యువతి యువకుల్లో కొనసాగుతోంది.. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరికొందరు తల్లిదండ్రుల మాటా వింటూనే వారి పని వారు చేస్తున్నారు..దీంతో పేరెంట్స్ చెప్పినట్టు విని సైలంట్‌గా పెళ్లి చేసుకుంటారు..ఇక ఆ.. తర్వతా.. తమకు జరిగింది ఓ బోమ్మల పెళ్లిగా భావించి... తన ప్రియునితో ప్రేమాయణం సాగిస్తున్నారు..ఇలా ఓ పెళ్లయిన యువతి కొద్ది రోజులకే ప్రియుడితో కలిసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది.. అలా వెళ్లిన ఇరవై అయిదు రోజులకే బయటి ప్రపంచంలోకి రాలేక ఆడవిలో ఆత్మహత్య చేసుకున్నారు...
మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెడ్డిగారి మోహన్(19) అదే గ్రామానికి చెందిన ఎరుకల లక్ష్మి (19) ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరువురు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో లక్ష్మికి గత ఆరు నెలల క్రితం కొమలంచ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది..ఇక అప్పటి నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నా..వారిలో ప్రేమ మాత్రం చావలేదు..దీంతో ఇద్దరు తమ ప్రేమాయాణాన్ని కొనసాంచారు.
ఇలా ఆరునెలలుగా దూరంగా ఉంటున్న ప్రేమికులు చివరకు ఒక్కటవ్వాలని నిర్ణయించారు..ఈ క్రమంలోనే గత 25 రోజుల క్రితం లక్ష్మిని కొమలాంచ నుండి మోహన్ తీసుకువచ్చాడు.. ఇక అప్పటి నుండి ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు వీరి కోసం వెదికారు..కాని ఎక్కడా దొరకపోవడంతో పోలీసు కేసు కూడా పెట్టకుండా సైలంట్‌గా ఉన్నారు...
కాని ఆ ఇరువురు ప్రేమికులు మాత్రం బయటి ప్రపంచానికి బయపడి తిరిగి గ్రామానికి చేరుకోలేక..సంసార జీవనాన్ని కొనసాగించలేక.. ఎవరికి కనిపించకుండా సైదాపూర్ సమీపంలోని అడవిలోకి వెళ్లారు.. అక్కడే చెట్టుకు ఇద్దరు ఒకేసారి ఉరి వేసుకుని మృతి చెందారు. శవాలు కుళ్లిన దశలో కనిపించాయి..సంఘటన స్థలం హృదయవిదాయకంగా కనిపించింది. నేడు అడవిలోకి మేకల కాపరికి మృతదేహాలు కంటపడడంతో విషయాన్ని పోలీసుకు తెలిపాడు. స్థానిక ఎస్‌ఐ అనిల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.