(P.Mahendar,News18,Nizamabad)
ఆడవాళ్లలో కొందరికి అలంకారం, ఆభరణాలపై ఉండే మోజు భర్తలపై ఉండదు. భర్త ఎలా చస్తే మాకెందుకు మేం కోరుకుంది మాకివ్వాల్సిందే అనే మంకు పట్టుదల పట్టి భర్తలను సాధించే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువయ్యారు. కామారెడ్డి(Kamareddy) జిల్లాలో ఓ ఇల్లాలు కూడా ఇలాగే ప్రవర్తించింది. రెండు కిడ్నీలు (Kidneys)చెడిపోయి ఆనారోగ్యానికి గురై భర్త బాధపడుతుంటే ..తనకు స్తలం అమ్మి నగలు (Jewelry) చేయించని భార్య పోరుపెట్టింది. భర్త ఆమె చెప్పినట్లుగా చేయలేదని చివరకు అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది.
నగల కోసం భర్తపై సాధింపు..
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన దార సత్యనారాయణ, దార నందిని (28) దంపతులకు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఈదంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా సత్యనారాయణ ఆరోగ్యం బాగోవడం లేదు. వైద్యులు టెస్ట్‌లు చేసి కిడ్నీ ఫెయిల్ అయినట్లుగా చెప్పారు. దీంతో కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అతని పరిస్థికి అంత దయనీయంగా ఉంటే భార్య దార నందిని తన కోరిక తీర్చమంటూ భర్తను వేధించసాగింది.
ఆభరణాల కోసం ఆత్మహత్య..
తనకు బంగారు నగలు చేయించమని నందిని భర్త సత్యనారాయణను కోరింది. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని..ఆరోగ్యం కుదుటపడిన తర్వాత చేయిస్తానంటూ సర్ది చెప్పాడు. అయితే నందిని మాత్రం భర్త మాటను పట్టించుకోలేదు. తమకు ఉన్న ఓ స్తలాన్ని అమ్మి ఆ డబ్బుతో నగలు చేయించమని భర్తను టార్చర్ పెట్టింది. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇంటి బయట సత్యనారాయణ కూర్చొని ఉండగా ఇంట్లో కి వెళ్లి తలుపులు వేసుకున్న నందిని ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది.
అనాథలైన బిడ్డలు..
ప్లాట్లు అమ్మి డబ్బులు ఇవ్వనందుకే తన కుతూరు నందిని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి కుడుదుల నీలవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఎలాంటి ప్లాట్లు అమ్మలేదని, సత్యనారాయణ అనారోగ్యంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భర్తకు ఆరోగ్యం బాగోలేని సమయంలో అండగా నిలవాల్సిన భార్య ఆడంబరాల కోసం భర్తను సాధించి ప్రాణాలు తీసుకోవడం దురదృష్టకరమని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. తండ్రి కిడ్నీ సంబంధిత సమస్యతో మంచనా పెడితే ..తల్లి బలవన్మరణం చేసుకోవడంతో ఇద్దరు చిన్నపిల్లలు అనాధలయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Telangana News, Women suicide