పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి.. మూడేళ్లకే ఘోరం.. పదో అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన సత్యసంతోషి, పవన్ భగవాన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో సత్య సంతోషి తల్లిదండ్రులు మూడు తులాల బంగారం, రూ.50వేల నగదును కట్నంగా అందించారు.

 • Share this:
  ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అన్నట్టుగానే ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి జరిగి మూడేళ్లు కూడా గడవకముందే ఆ భర్త అసలు రూపం చూపించాడు. కట్టుకున్న భార్య కంటే కట్నమే ఎక్కువనుకున్నాడు. మనసిచ్చిన ఆలి కంటే డబ్బే ప్రాణం అనుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. ప్రాణానికి ప్రాణం అనుకున్న భర్తే తనను వేధిస్తుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. మనస్తాపంతో కుమిలిపోయింది. వారి నివాసానికి దగ్గరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారు. ఆ డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వెళ్లి నెమ్మదిగా పదో అంతస్థు వరకు ఎక్కింది. పదో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన సత్యసంతోషి, పవన్ భగవాన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో సత్య సంతోషి తల్లిదండ్రులు మూడు తులాల బంగారం, రూ.50వేల నగదును కట్నంగా అందించారు. పెళ్లి జరిగిన తర్వాత భర్త, అత్తమామలతో కలిసి మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లయిన కొన్నాళ్ల నుంచే కట్నం తక్కువే తెచ్చిందంటూ సత్యసంతోషిపై అత్తమామలు నిందలు వేసేవాళ్లు. వారికి తోడు ఇటీవల భర్త వేధింపులు కూడా తోడయ్యాయి.
  ఇది కూడా చదవండి: భార్యపై అనుమానం.. తెల్లవారుజామున ఆమె బాత్రూంలోకి వెళ్లడం చూసిన భర్త.. ఆమె వెనుకే వెళ్లి..

  అదనపు కట్నం తేవాలంటూ సత్య సంతోషిని భర్త, అత్తమామలు వేధించేవాళ్లు. వారి వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి సత్య సంతోషి వచ్చింది. వారు ఉండే ఇంటికి దగ్గరలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అక్కడకు వెళ్లి పదో అంతస్థు వరకు ఎక్కింది. అక్కడే చెప్పులు, చున్నీ, మొబైల్ వదిలేసి పై నుంచి కిందకు దూకేసింది. ఆమె ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బోరు విలపించారు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

  ఇది కూడా చదవండి: బావిలోంచి అరుపులు.. ఏంటా అని చూస్తే లోపల ఓ యువతి, ఓ యువకుడు.. అసలేం జరిగిందంటే..
  Published by:Hasaan Kandula
  First published: