హోమ్ /వార్తలు /తెలంగాణ /

Lovers suicide : భార్య గర్భవతిగా ఉండగానే టీనేజ్‌ గర్ల్‌తో లవ్ అఫైర్ .. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఏం చేశారంటే

Lovers suicide : భార్య గర్భవతిగా ఉండగానే టీనేజ్‌ గర్ల్‌తో లవ్ అఫైర్ .. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఏం చేశారంటే

lovers suicide

lovers suicide

Lovers suicide: మనుషుల మధ్య ఉండే ఆకర్షణ కొత్త బంధాల్ని కోరుకుంటోంది. తెలిసి తెలియని వయసులో తాము ఊహించుకున్నట్లుగా జీవించాలనే మొండి పట్టుదలతో చివరకు ప్రాణాలు వదలడానికి కూడా వెనుకాడటం లేదు. సిద్దిపేట జిల్లాలో ఓ ప్రేమజంట విచిత్రంగా ప్రాణాలు తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

(K.Veeranna,News18,Medak)

మనుషుల మధ్య ఉండే ఆకర్షణ కొత్త బంధాల్ని కోరుకుంటోంది. తెలిసి తెలియని వయసులో తాము ఊహించుకున్నట్లుగా జీవించాలనే మొండి పట్టుదలతో చివరకు ప్రాణాలు వదలడానికి కూడా వెనుకాడటం లేదు. తమనే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏమైపోతుందో అనే ఆలోచన , సమాజం ఎలా చూస్తుందో అనే మానసిక పరిపక్వత లేని ఓ యువతి ఓ వివాహితుడి ప్రేమలో పడింది. అతడితోనే జీవితాన్ని గడపాలని భావించి చివరకు అతడితోనే కాటికి పయనమైన సంఘటన సిద్దిపేట(Siddipet)జిల్లాలో చోటుచేసుకుంది.

Telangana : గణేష్ ఉత్సవాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం ..శోభయాత్ర, నిమజ్జనంలో ముస్లిం సోదర, సోదరీమణులు

టీనేజ్‌ గర్ల్‌తో వివాహితుడి లవ్ స్టోరీ..

సిద్దిపేట జిల్లాలో విచిత్రమైన ప్రేమజంట ప్రాణాలు తీసుకుంది. ఈసంఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ములుగు మండలంలోని మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన 28సంవత్సరాల గొట్టి మహేష్ అనే వివాహితుడు మర్కూకు చెందిన పదిరి స్వప్న అనే 19ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. మహేష్‌కి ఏడేళ్ల క్రితమే వివాహం జరిగింది. అతని భార్య కృష్ణవేణి ప్రస్తుతం గర్భివతి. పెద్దల సమక్షంలో సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్న మహేష్ ప్రియురాలు స్వప్న మోజులో పడిపోయాడు. ఆమెను కూడా తనను ప్రేమించే విధంగా మార్చుకున్నాడు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందామనుకున్నారు.

గర్భవతి భార్యను పెట్టుకొని మళ్లీ పెళ్లి..

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు మహేష్. అందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించలేదు. పెళ్లై భార్య ఉండగా మళ్లీ ప్రేమ, పెళ్లి ఏంటని చివాట్లు పెట్టారు. అటువైపు నుంచి ప్రేమించిన అమ్మాయి స్వప్న తల్లిదండ్రులు సైతం వాళ్ల పెళ్లి నిర్ణయాన్ని తిరస్కరించారు. ఇరువర్గాలు తమ ప్రేమ వివాహాన్ని ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. కలిసి జీవించలేమనే బాధతో కలిసి చావాలని నిర్ణయించుకున్నారు.

Telangana: ఒకప్పుడు రాళ్లు రప్పలతో ఎడారిగా ఉన్న గుట్ట ఇప్పుడు పచ్చని రంగు వేసినట్టు ఉంది ఎక్కడంటే ..?

పిచ్చి ప్రేమను తిరస్కరించిన పెద్దలు..

శనివారం తెల్లవారు జామునే మహేష్‌ తన దూరపు బంధువు అయినటువంటి నవీన్‌కి ఫోన్ చేసి తాము ఉరివేసుకుంటున్న స్తలం లొకేషన్‌ని వాట్సాప్‌లో పంపించాడు. అనంతరం అడవి మజీద్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో వేపచెట్టుకు మహేశ్, స్వప్న ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ములుగు పోలీస్ స్టేషన్ కౌన్సెలింగ్ ఇచ్చారు ఎస్‌ఐ రంగాకృష్ణ. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలకు గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు మృతదేహాలను అప్ప గించారు. ప్రేమ అనే పిచ్చి ఆలోచనలతో గర్భవతిగా ఉన్న భార్యకు మహేష్ అన్యాయం చేస్తే ...స్వప్న కన్నవాళ్ల బాధను అర్ధం చేసుకోకుండా క్షణికావేశంలో సూసైడ్ నిర్ణయం తీసుకోవడం అందర్ని బాధించింది.

First published:

Tags: Lovers suicide, Siddipet, Telangana News

ఉత్తమ కథలు