Home /News /telangana /

MARRIED MAN CHEATING YOUNG GIRLS WITH THE NAME OF LOVE AND MARRIAGE VRY

Woman cheating : బట్ట తలపై విగ్గు పెట్టుకుని యువతుల మోసం.. భార్య ఉన్నా.. 20 మందిని చీటింగ్...

Woman cheating : బట్ట తలపై విగ్గు పెట్టుకుని యువతుల మోసం..

Woman cheating : బట్ట తలపై విగ్గు పెట్టుకుని యువతుల మోసం..

Woman cheating : పెళ్లై భార్యకు దూరంగా ఉంటున్న ఓ నిందితుడు.. అమ్మాయిలను ట్రాప్ చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. జల్సాకు అలవాటు పడి సుమారు 20 మందిని మాయమాటలతో మోసం చేసిన నిందితున్ని నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

    తూర్పు గోదావరి జిల్లా (East Godavari ) తుని మండలం హంసవరానికి చెందిన షేక్‌ మహ్మద్ రఫి అలియాస్ కార్తీక్‌ వర్మ(29) పాలిటెక్నిక్ కోర్సును మధ్యలోనే ఆపేశాడు. 2010 ఆగస్టులో హైదరబాద్‌కు వచ్చి ప్రైవేటు ఉద్యోగం చేశాడు. 2017లో నెల్లూరు జిల్లా గూడూరుకి చెందిన యువతితో పెళ్లి అయ్యింది. భార్యను కట్నం కోసం వేధించడంతో ఆమె గూడూరులో మహ్మద్ రఫిపై కేసు పెట్టింది. దీంతో భార్యను గూడూరులో వదిలేసి రఫి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు.

    తర్వాత హైదరాబాద్‌లో ( Hyderabad ) సులభంగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాల్లో నిమగ్నమయ్యాడు. విలాసవంతంగా బతకడానికి అలవాటుపడిన రఫీ అందుకు అవసరమైన డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. డబ్బు కోసం యువతులను ట్రాప్ చేయడం మొదలుపెడ్టాడు రఫీ.సోషల్ మీడియాలో ( facebook ) లో ఫేక్ ఐడి క్రియోట్ చేసి అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకోవడం మొదలుపెట్టాడు. దీనికి అదనంగా అమ్మాయిలను ఆకర్షించేందుకు తనకు బట్టతల ఉన్నా .. వయస్సును కనిపించకుండా విగ్గును పెట్టి మెయింటెన్ చేసేవాడు.. సోషల్ మీడియాలో ఆకర్షనీయమైన ఫోటోలు ( photos) పెట్టి యువతులను ట్రాప్ కోసం వాడేవాడు..

    ఇది చదవండి  : విద్యార్థులను భయపెడుతున్న కరోనా.. నల్గొండ స్కూళ్లో పాజిటివ్


    తాను అమెరికాలో పుట్టానని, చిన్నతనంలోనే హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యానంటూ అమ్మాయిలను నమ్మించేవాడు. తన తల్లి సింగపూర్‌లో డాక్టర్‌గా పని చేస్తోందంటూ వారితో మాయమాటలు చెప్పేవాడు.ఇలా వారితో ప్రేమ, సహజీవనం పేరుతో వారిని మోసం చేసేవాడు. అవసరాల కోసం వారి నుంచి నుంచి బంగారం, డబ్బులు (Money) తీసుకుని కనబడకుండా మాయం అయ్యెవాడు.. ఈ క్రమంలో ఎస్‌ఆర్‌నగర్‌కి చెందిన ఓ యువతిని మహ్మద్ రఫి మోసం చేయడంతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు (Case) ఫైల్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.. పోలీసుల విచారణలో తెలంగాణ, ఆంధ్రప్రాంతానికి చెందిన 20 మంది అమ్మాయిలను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో రఫి అరెస్ట్ చేసి రిమాండ్‌ తరలించారు.

    కాగా బుధవారం నల్గొండ జిల్లాలో కూడా చర్చిలో డ్రమ్స్ వాయించే విలియమ్స్ అనే వ్యక్తి కూడా ఇలా సహజీవనం పేరుతో 19మందిని మోసం చేసి డబ్బు గుంజడంతో నిందితుని చేతిలో మోసపోయిన ఓ మహళ ఫిర్యాదుతో విలియమ్స్‌ను అరెస్ట్ చేశారు. విలియమ్స్ కూడా మహిళలకు మాయమాటలు చెబుతూ.. వారి వద్ద లక్షల రూపాయలను తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Cheating case, Hyderbad, WOMAN

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు