Home /News /telangana /

MARRIAGE VAN MET WITH AN ACCIDENT MANY PEOPLE ARE INJURED IN VEMULAWADA VRY

Vemulawada : వేములవాడలో పెళ్లి వ్యాన్ బోల్తా.. పలువురికి గాయాలు..

Vemulawada : వేములవాడలో పెళ్లి వ్యాన్ బోల్తా.. పలువురికి గాయాలు..

Vemulawada : వేములవాడలో పెళ్లి వ్యాన్ బోల్తా.. పలువురికి గాయాలు..

Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లివస్తున్న ప్రైవేటు వాహనం బోల్తా పడింది. కాగా వాహనంలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

    నేడు మధ్యాహ్నాం వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ ప్రైవేటు డీసిఎం బోల్తాపడింది. కాగా డీసీఎం వ్యాన్‌లో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం, కాగా వారందరికి గాయాలపాలైనట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

    స్థానిక పోలీసుల కథనం ప్రకారం మేడిపల్లిమండలం రాజలింగంపేటకు చెందిన కుటుంబం వేములవాడ మండలం హునమాజీపేటలో జరిగిన పెళ్లి వేడుకకు హజరై సాయంత్రం తిరుగు ప్రయాణయ్యారు. ఈ క్రమంలో హామాజీపేట శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి డీసీఎం వ్యాన్ బోల్తాపడినట్టు తెలిపారు. దీంతో వ్యాన్‌లో ఉన్న 40 మందికి గాయాలు అయినట్టు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన తర్వాత అక్కడే ఉన్న స్థానిక గ్రామస్థులు గాయపడిన వారిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా మరికొందరిని సిరిసిల్లకు తరలించినట్టు తెలుస్తోంది.

    ఇది చదవండి : ఈ పోలీసులకు ఏమైంది.. ఇంకా తీరు మారలేదా.. ? జై భీం రీపిట్ అవుతుందా..?


    కాగా నేడు మధ్యాహ్నం వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో సుమారు 50 మంది వరకు ప్రయాణిస్తుండగా వారిలో 20మంది వరకు గాయాలయ్యాయి. అయితే.. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కండక్టర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

     ఇది చదవండి : టీఆర్ఎస్, బీజేపీలు ప్రజల్లో చెవుల్లో పూలు పెట్టడానికే ధర్నాలు..

    Published by:yveerash yveerash
    First published:

    Tags: Accident, Vemulawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు