హోమ్ /వార్తలు /తెలంగాణ /

Medak : ముహుర్తానికి ముందే బంధువు మృతి.. కీడు అంటూ.. పెళ్లిని రద్దు చేసిన వరుడు... !

Medak : ముహుర్తానికి ముందే బంధువు మృతి.. కీడు అంటూ.. పెళ్లిని రద్దు చేసిన వరుడు... !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Medak : పెళ్లికి ముందు అమ్మాయి బంధువులు చనిపోయారని.. ఆ పెళ్లిని నిరాకరించాడు ఓ పెళ్లి కొడుకు.. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం కాస్త పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. అయినా వరుడు వినకపోవడంతో వరుడి కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇంకా చదవండి ...

News 18 ప్రతినిధి కె.వీరన్నమెదక్ జిల్లా


పెళ్లంటే నూరెళ్ల పంట అంటారు.. అందుకే పెళ్లి కోసం అనేక తంటాలు పడి తమకు నచ్చిన సంబంధం కోసం కుటుంబ సభ్యులు వెతుకుతారు. అంతా ఓకే అనుకున్నాక జాతకాలు, ముహుర్తాలు చూస్తారు.. ఆ ముహుర్తానికి పెళ్లి జరగాలని భావిస్తారు. ( Marriage cancelled due to relative of bride death ) ఇప్పటి వరకు అంతా సవ్యంగా జరిగినా... ముహుర్తాలు పెట్టుకున్న తర్వాత ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తారు..కాని... పెళ్లి ముందు అటు అబ్బాయి కుటుంబంలో కాని, అమ్మాయి కుటుంబంలో కాగి ఏ చిన్న అశుభకార్యం జరిగిన ఇక అనుమానాలే , పెళ్లి జరుగుతుందా లేదా అనేది ఆయా కుటుంబాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రమాదాలు, మరణాలు జరిగాయంటే ఇక అంతే సంగతులు.( Marriage cancelled due to relative of bride death ) ఆ పెళ్లికి బ్రేకులు పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి తల్లి ఇంటి నుండి అత్తారింటికి అడుగు పెట్టె సమయంలో ఇలా ప్రమాదాలు ఆమె భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.. ఇలా తాజాగా ఓ పెళ్లి కొడుకు పెళ్లి ముహుర్తానికి ముందే ఆ గ్రామంలో వారి బంధువులు చనిపోవడంతో పెళ్లి వద్దంటూ మొండికేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం చెద్లాపూర్ గ్రామానికి చెందిన కిషన్ అనే యువకుడితో కొమరవెల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కోసం వధువు కుటుంబం అంతా సిద్దం చేసింది. బుధవారం మధ్యహ్నాం పెళ్లి ముహుర్తానికి అంతా సిద్దమయ్యారు.. ఇంటికి బంధువులు కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడే ఓ విషాదం చోటు చేసుకుంది.( Marriage cancelled due to relative of bride death ) వివాహ సమయానికి కొద్ది గంటల ముందే గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ పెళ్లి కూతురుకు బంధువులు అవుతారు. ఈ విషయం కాస్త వరుడితో పాటు వారి బంధువులకు కూడా తెలిసింది. దీంతో పెళ్లి జరగాల్సిన చోట బంధువుల మహిళ చనిపోవడంతో ఆ పెళ్లిని సమీపంలోని ఓ ఆలయానికి మార్చారు.

Jagityala : ధర్నాలో ఆశా వర్కర్లు... మధ్యలో పెళ్లికూతురు.. హైరానాలో పెళ్లికొడుకు.. ! ఇంతకి పెళ్లి కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?


అయితే పెళ్లి సమయంలో పెళ్లి కూతురు బంధువులు చనిపోవడంతో దాన్ని సంప్రాదాయం ప్రకారం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటూ వరుడు చెప్పాడు. అలా చేసుకోవడం ద్వారా తమకు కీడు జరుగుతుందని చెప్పారు. దీంతో బంధువులంతా బతిమాడారు.. అయినా వినకపోవడంతో వధువు తరపున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ( Marriage cancelled due to relative of bride death ) ఈ ఘర్షణలోనే పెళ్లి కూతురు కుటుంబానికి చెందిన వారు వరుడిపై చేయి చేసుకున్నారు. దీంతో విషయం కాస్తా పోలీసులకు చేరింది. పోలీసులు రంగప్రవేశం చేసి వరుడికి నచ్చజెప్పారు. పెళ్లి మధ్యలో ఆగిపోవడం కరెక్టు కాదని చెప్పారు. అయినా వరుడు తనపై చేయిచేసుకోవడంతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు వరుడిపై కేసు నమోదు చేశారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఇబ్బందులు మరేవరికి రాకూడదని వాపోయారు.


Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Marriage, Medak

ఉత్తమ కథలు