హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: తెలంగాణ పాఠశాలల్లో చేరుతున్న మరాఠీ విద్యార్థులు.. కారణమిదే..

Telangana: తెలంగాణ పాఠశాలల్లో చేరుతున్న మరాఠీ విద్యార్థులు.. కారణమిదే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పాఠశాలలకు మహారాష్ట్ర నుంచి విద్యార్థులు వచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. అది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో. ఇంతకీ ఎందుకు అక్కడే జాయిన్​ అవుతున్నారు?

మహారాష్ట్ర (Maharashtra) . తెలంగాణ (Telangana) సరిహద్దు రాష్ట్రం. అయితే ఇరు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల (Government schools) మధ్య ఎంతో తేడా ఉంది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పక్క భవనాలు, ఇంగ్లీష్ మీడియం చదువులు, కంప్యూటర్ పాఠాలు చెబుతున్నారు.  మరాఠీ (Marati) పాఠశాలలో రేకుల షెడ్లు, మరాఠీ భాషలో విద్యా బోధనలు. ఇవి చాలవు విద్యార్థులను పాఠశాల ఆకర్శించడానికి.  సరిగ్గా చదువుకోవాల్సిన సమయంలో సరైన వసతులు లేక అక్కడి మరాఠీ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువైపు మరాఠీ భాషలో విద్యా బోధన. ఇటువైపు ఇంగ్లిష్‌ మీడియం చదువులు. కంప్యూటర్‌ పాఠాలు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో మహారాష్ట్ర విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. వీరికి టీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్‌ పాస్‌ కూడా ఇస్తుండటంతో ఆడపిల్లలను సైతం తెలంగాణకు పంపిస్తున్నారు మహారాష్ట్రలోని విద్యార్థుల తల్లిదండ్రులు. ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల విద్యార్థులు సైతం ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

తరగది గదులన్నీ పక్కా భవనాలే..

మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా కేలాపూర్‌ తాలూకా సున్నా గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉచ్ఛ్‌ ప్రాథమిక్‌ కేంద్రం. అంటే హైస్కూలు రాళ్లు రప్పలతో కూడిన ప్రాంగణం..మధ్యాహ్నం భోజనంలో కిచిడీ, నీళ్ల చారు.. వారానికి ఒకసారి మాత్రమే కోడిగుడ్డు ఇస్తారు. ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు, 9-10 తరగతుల్లో 80 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా జైనథ్‌ మండలం పిప్పరవాడలోని ఉన్నత పాఠశాల (High schools).. ఈ పాఠశాల తరగది గదులన్నీ పక్కా భవనాలే. తాజాగా మరొకటి నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంగ్లిష్‌ మీడియంలో చదువు చెప్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 102 మంది, 6 నుంచి 10 తరగతి వరకు 154 మంది విద్యార్థులు చదువుతున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు వడ్డిస్తారు. వారానికి మూడు రోజులు (రోజు విడిచి రోజు) కోడిగుడ్డు పెడతారు. టీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సుపాస్‌ సదుపాయం కల్పించడంతో వారు ఉదయం పాఠశాలకు వచ్చి.. సాయంత్రం తిరిగి వెళ్తున్నారు.

ఇంగ్లిష్‌ మీడియం ప్రాధాన్యాన్ని గుర్తించిన పిప్పరవాడ గ్రామ ప్రజలు మూడేండ్ల క్రితమే ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారు. దీనితో గ్రామంలో ఉన్న ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూలులో.. గత సంవత్సరం నుంచి ఒకటి, రెండో తరగతులను పూర్తిగా మూసేశారు.ఇలా ఉన్నత చదువుల కోసం మరాఠి విద్యార్థులు మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు. చివరగా చెప్పేదేంటంటే.. మన తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం ఇతర రాష్ట్రాల విద్యార్థులను సైతం ఆకర్షిస్తోంది.

First published:

Tags: English medium, Maharashtra, Telangana schools

ఉత్తమ కథలు