Home /News /telangana /

MAOISTS HAVE REALSED A LETTER AGAINST EETALA RAJENDER

Maoist letter : ఈటల రాజేందర్ రాజీనామాపై మావోయిస్టుల లేఖ...! సీఎం కేసిఆర్..ఈటల రాజేందర్ ఇద్దరు ఒక్కటే...

Maoist letter : ఈటల రాజేందర్ రాజీనామాపై మావోయిస్టుల లేఖ...! సీఎం కేసిఆర్..ఈటల రాజేందర్ ఇద్దరు ఒక్కటే...

Maoist letter : ఈటల రాజేందర్ రాజీనామాపై మావోయిస్టుల లేఖ...! సీఎం కేసిఆర్..ఈటల రాజేందర్ ఇద్దరు ఒక్కటే...

Maoist letter : వామపక్ష భావజాలంతో ఉంటానని చెబుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మావోయిస్టులు ఘాటైన లేఖ విడుదల చేశారు. ఇటివల బిజెపిలో చేరిన ఈటల వ్యవహారంపై తీవ్రంగా విమర్శించారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్ బిజెపిలో చేరారని లేఖలో పేర్కొన్నారు. దీంతో ప్రజల ఆకాంక్షలకు ఈటల తూట్లు పొడిచారని తీవ్రంగా మండిపడ్డారు..

ఇంకా చదవండి ...
    మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం  రెండు రోజుల క్రితం బిజెపీలో చేరారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వామపక్ష భావజాలంతో ఉన్నానని , ముఖ్యంగా ఆర్ఎస్‌యూ భావజాలంతో పనిచేస్తానని ప్రకటించారు. ఇక కొద్ది రోజుల తర్వాత తాను లెఫ్ట్ కాదు రైట్‌ కాదు.. ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తానని ప్రకటించారు.

    ఈ నేపథ్యంలోనే ఈటలను విమర్శిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను విడుదల చేశారు. లేఖలో ఈటలతో పాటు సీఎం కేసిఆర్‌ను ఘాటుగా విమర్శించారు. ఇక ఈటల రాజీనామాను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

    సీఎం కేసిఆర్ ,ఈటల రాజెందర్ ఒకే గూటి పక్షులని అభివర్ణించారు.వాళ్లు ఇద్దరు ప్రజల ఆకాంక్షలను తూట్లు పొడిచారని విమర్శించారు. దీంతోపాటు ఈటల రాజీనామా వ్వవహరం తెలంగాణ ప్రజలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు.  పేదల భూములను ఈటల రాజేందర్ ఆక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. ఇక తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం చేస్తానని ప్రకటించిన ఈటల రాజేందర్ తన ఆస్తుల రక్షణ కోసమే బిజెపిలో చేరారని దుయ్యబట్టారు. రాజీనామా అంశం సీఎం కేసిఆర్, ఈటల రాజేందర్‌కు సంబంధించిన అంశంమని అన్నారు.

    మొత్తం మీద మావోల లేఖతో ఈటల రాజేందర్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలకు మరింత బలం చేకూరనున్నాయి. . ..  ఆరోపణల నేపథ్యంలోనే  సీఎం కేసిఆర్‌కు వ్యతిరేకంగా మరోపార్టీ పెడతారనే ప్రచారం తీవ్రంగా జరిగినా... రాజకీయ ఒత్తిళ్లు ఓవైపు..కేసులు మరోవైపు ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి.  రాజీకీయంగా దెబ్బతీసేందుకు సీఎం కేసీఆర్ ఈటలను అన్ని వైపుల నుండి టార్గెట్ చేశారు..దీంతో గతంలో ఉన్న పార్టీల అనుభవాలు, భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఈటల రాజేందర్  పార్టీ పెట్టే యోచనను ఆయన విరమించుకున్నట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే మావోయిస్టుల ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేకపోయినా..వారి అభిప్రాయం ప్రజల్లో కొంత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.. సాధారణంగా ఈటలను సీఎం కేసిఆర్ అన్యాయంగా మంత్రి వర్గం నుండి బయటకు పంపించాడనే సానుభూతి కొంత పనిచేస్తోంది.. ప్రస్తుతం మావోల లేఖతో సాధారణ ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కానున్నాయి..

    మరోవైపు  బిజెపీ మావోయిస్టును ఏరివేసేందుకు  దేశవ్యాప్తంగా అనేక ఎత్తుగడలు వేస్తుందని మావోలు ఆరోపిస్తున్నారు..దీంతో ఆ పార్టీ విధానాలపై మావోయిస్టులు సాధారణంగా విమర్శలు ఎక్కుపెట్టేందుకే అవకాశాలు ఉన్నాయి..ఈ కోణంలోనే ఈటలకు వ్యతిరేకంగా మావోలు లేఖలు రాశారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్‌యూ భావజాలం ఉన్న ఈటల ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న పార్టీలోకి వెళ్లి ఎలా న్యాయం చేస్తారని మావోలు సైతం తన లేఖలో ప్రశ్నించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Eetala rajender, Maoists

    తదుపరి వార్తలు