Home /News /telangana /

MAOISTS FIRE MINES GREYHOUNDS RSI INJURED NEAR BHADRADRI KOTHAGUDEM DISTRICT KMM VB

Maoist: నక్సల్స్ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు.. దానిలో భాగంగానే ఇవన్నీ..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (bhadradri kothagudem) తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో (telangana chhattisgarh border) మావోయిస్టులు (maoists) కలకలం సృష్టించారు.బుధవారం చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను (landmine) పేల్చారు.

ఇంకా చదవండి ...
(G.SrinivasaReddy,News18,Khammam)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (bhadradri kothagudem) తెలంగాణ-ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో (telangana chhattisgarh border) మావోయిస్టులు (maoists) కలకలం సృష్టించారు.బుధవారం చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను (landmine) పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్​ ఆర్​ఎస్​ఐ గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.ఇక ఇటీవలి కాలంలో పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

MLC Elections: ఒంటిచేత్తో విజయఢంకా.. మంత్రి పువ్వాడ చాతుర్యం.. గెలుపుకు సహకరించినవి ఇవే..


నక్సల్స్ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో ధీటుగా జవాబిస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్​పీఎఫ్​ బలగాల కూంబింగ్ కొనసాగుతూనే వుంది. దీనితో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు.

ఇప్పటికే తెలంగాణ - ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో మావోయిస్టుల చొరబాట్ల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మావోయిస్టులు తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్​పీఎఫ్​ బలగాలతో కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కలిసి కూంబింగ్‌ నిర్వహించడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే మందుపాతర పేల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మావోయిస్టులను పట్టుకునేందుకు అదనపు బలగాలను ఉన్నతాధికారులు ఆ ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Etela Rajendar: ఈటల రాజేందర్‌కు ఈసారి షాక్ తగిలిందా ?.. వ్యూహం బెడిసికొట్టిందా ?

ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆర్టిసికి చెందిన బస్సును గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో నిలిపివుంచిన బస్సుకు దుండగులు నిప్పంటించి పరారయ్యారు. అయితే స్థానికులు మంటలను గమనించి ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మంటల్లో కాలిపోయి బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కాలిపోయిన బస్సును పరిశీలించారు. బస్సుకు నిప్పుపెట్టిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు. ఇది ఆకతాయిల పనా...? లేక మావోయిస్టుల దుశ్చర్యా..? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇక వెంటాపురం విషయానికి వస్తే.. ఇక్క మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. ఇలా ఆర్టీసీ బస్సు దహనం కావడతో ఇది కచ్చితంగా మావోయిస్టులు చేసిన పనే అనేది పోలీసులు అనుమానిస్తారు.  ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపడంతో.. ఈ చర్య కూడా వాళ్ల పనే అనేది పోలీసులు తెలుపుతున్నారు. అంతే కాదు.. కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలోనే మావోలకు.. పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోలు మరణించిన విషయం తెలిసిందే.
Published by:Veera Babu
First published:

Tags: Khammam, Maoist

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు