MAOISTS CALL FOR TELANGANA STATE BANDH ON JULY 25 COUNTERS DGPS REMARKS MK
ఈనెల 25న తెలంగాణ రాష్ట్ర బంద్కు మావోయిస్టుల పిలుపు...డీజీపీ వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్...
ప్రతీకాత్మక చిత్రం
డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో చేసిన చేసిన వ్యాఖ్యలకు మావోయిస్టులు కౌంటర్ ఇచ్చారు. మావోయిస్టు నేత మహేష్ ఆడియో, లెటర్ విడుదల విడుదల చేశారు. లేఖలో డీజీపీ మావోయిస్టులు విలాస జీవితం గడుపుతున్నారంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నెల 25న తెలంగాణ బంద్కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ మావోయిస్టు కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. అంతేకాదు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని లేఖలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కోరింది. అంతేకదు డీజీపీ మహేందర్ రెడ్డి ములుగు జిల్లాలో చేసిన చేసిన వ్యాఖ్యలకు మావోయిస్టులు కౌంటర్ ఇచ్చారు. మావోయిస్టు నేత మహేష్ ఆడియో, లెటర్ విడుదల విడుదల చేశారు. లేఖలో డీజీపీ మావోయిస్టులు విలాస జీవితం గడుపుతున్నారంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, అప్రజాస్వామికంగా సచివాలయాన్ని కూల్చుతున్నారని విమర్శించారు. అలాగే హరితహారం పేరుతో రైతులను సొంత భూముల నుంచి గెంటి వేస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మరోసారి మావోయిస్టులు రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వమని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరించారు. భూపాలపల్లి‒ములుగు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల రివ్యూ మీటింగ్ వెంకటాపురం పోలీస్స్టేషన్లో నిర్వహించారు. అనంతరం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ దాదాపు పదేళ్ల తర్వాత మావోయిస్టులు మళ్లీ రాష్ట్రంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్ తదితరులు చత్తీస్గఢ్ విలాస జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులు చేస్తున్నారని అన్నారు. మావోయిస్టులకు రాష్ట్రంలో ఎవరూ సహకరించకూడదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనే పథకంతో తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను పోలీస్ శాఖ తిప్పి కొడుతుందన్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.