ములుగు జిల్లాలో కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి . వెంకటాపురం మండలం విజయపూర్ కాలనీ గ్రామ సమీపంలోని వాజేడు మండలం నుండి భద్రాచలం వెళ్లే రహదారి ఇరువైపులా ఉన్న చెట్లకు మావోయిస్టుల వాల్ పోస్టర్లు , కరపత్రాలను ఏర్పాటు చేశారు. ఆ కరపత్రాలలో ఈనెల 28 వ తేదీ నుండి ఆగస్టు వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు గ్రామ గ్రామాన జరుపుకోవాలని అమరులైన మావోయిస్టులకు ప్రతి ఒక్కరు జోహార్లు తెలియజేయాలని పేర్కొన్నారు . ఈ వాల్ పోస్టర్లు కరపత్రాలు చర్ల -శబరి ఏరియా కమిటీ పేరుతో ఉన్నాయి . మారుమూల మన్యం ప్రాంతమైన వెంకటాపురం మండలంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపడంతో పోలీసు వర్గాల అప్రమత్తమయ్యారు . మావోయిస్టుల హిట్ లిస్ట్ ఉన్న రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు . సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వారికి సూచించినట్లు సమాచారం . ఈ వార్తల నేపథ్యంలో మన్యం ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను భారీగా నిర్వహించాలని మావోయిస్టులు, వీరి ప్రయత్నాలను భగ్నం చేయాలని పోలీసులు పట్టుదలతో ఉండటంతో ఎటువంటి హింసాత్మక సంఘటలు జరుగుతాయోనని ఆదివాసీలు భయపడుతున్నారు. అయితే వీటిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాల నేపథ్యంలో మావోలు అలజడి సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు విస్తృత గాలింపు చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో అటవీ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ప్రధాన రహదారులపై వాహన రాకపోకలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఛత్తీష్ ఘడ్ సుక్మా జిల్లా చింతగుఫ్ఫ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనను ఎస్పీ సునిల్ శర్మ ధృవీకరించారు.
అయితే ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగునున్న నేపథ్యంలో యస్టియఫ్, సీఆర్పీఎఫ్ జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసుల విస్తృత తనిఖీలు చేప్పటింది. ఎన్కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి మృతదేహాం స్వాధీనం చేసుకున్నారు. మృతులు పెరిగే అవకాశం ఉందని తెలిపిన ఎస్పీ సునిల్ శర్మ.. ఆపరేషన్ చింతగుఫ్ఫలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య హోరాహోరీ గా సుమారు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కూబింగ్ లో సీఆర్ పీఎఫ్ 150, 131, యస్టియఫ్, డీఆర్జీ, బలగాలు పాల్గొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Chatisghad, Khammam, Maoist, Maoist attack