Home /News /telangana /

MAOIST MADHUKAR DIED OF HEART ATTACK DURING THE CORONA TREATMENT TODAY MORNING VRY

maoist died : కరోనా చికిత్స పొందుతూ... మావోయిస్టు మధుకర్ గుండెపోటుతో మృతి..

 మావోయిస్టు మధుకర్ గుండెపోటుతో మృతి..

మావోయిస్టు మధుకర్ గుండెపోటుతో మృతి..

maoist died : ఇటివల పోలీసులకు పట్టుబడ్డ మావోయిస్టు మధుకర్ కరోనా చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 2న కరోనా చికిత్స కోసం వచ్చిన మధుకర్ వరంగల్ అర్భన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటివల వరంగల్ జిల్లాల్లో పట్టుబడ్డ మావోయిస్టు నేత మధు గుండెపోటుతో మరణించాడు..కరోనా చికిత్స కోసం వస్తున్న నేపథ్యంలోనే ఆయన పట్టుబడ్డాడు.దీంతో మధును అరెస్ట్ చేసిన పోలీసులు కరోనా చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు.

కాగా మధు మృతదేహాన్ని ఆయన స్వగ్రామం అయిన కుమురంభీం జిల్లా పెంచికలపేట్ మండలం కొండపల్లికి తరలించనున్నారు. మధు పీపుల్స్‌ వార్ సిద్దాంతాలకు ఆకర్షితుడై 22 సంవత్సరాల క్రితం చేరాడు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటి కార్యదర్శిగా కొన్నసాగుతున్నాడు.

ఈనెల రెండున మధుకర్ వరంగల్ అర్భన్ జిల్లా ములుగు రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు..అనంతరం ఆయన్ను వరంగల్ పోలీసులు విచారించారు.అతణ్ని జుడీషియల్‌ రిమాండ్‌కు పంపే క్రమంలో చేసిన వైద్య పరీక్షల్లో మధుకర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కోణంలో ఆరా తీశారు.. విచారణలో ఇప్పుడు మావోయిస్టు ఉద్యమంలోని పలువురు కీలక నేతలను సైతం కరోనా చుట్టుముట్టిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు కూడా కరోనా సోకినట్టు తెలిసింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోని కీలకమైన పన్నెండు మంది నేతలు కోవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్నారన్న విషయం వెల్లడైంది. వీరిలో కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవుజి, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి అలియాస్‌ వికల్ప్‌, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాస దడ, కంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, ముచ్చకి ఉజల్‌ అలియాస్‌ రఘు, కొడి మంజుల అలియాస్‌ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్‌ బుర్రా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడిచేశారు. అయితే వీరంతా బయటకు వస్తే చికిత్స అందిస్తామని ఆయన చెప్పారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Hyderabad, Maoist

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు