Home /News /telangana /

MAOIST MADHUKAR DIED DUE TO POLICE TORTURE MAOIST RELEASED A LETTER VRY

Maoist madhukar : మావోయిస్టు మధుకర్‌ కరోనాతో కాదు...పోలీసు చిత్రహింసల వల్లే మృతి...?

మావోయిస్టు మధుకర్‌ కరోనాతో కాదు...పోలీసు చిత్రహింసల వల్లే మృతి...?

మావోయిస్టు మధుకర్‌ కరోనాతో కాదు...పోలీసు చిత్రహింసల వల్లే మృతి...?

Maoist Letter : కరోనా చికిత్స కోసం వచ్చి పోలీసులకు పట్టుబడిన మావోయిస్టు మధుకర్ ఆలియాస్ శోబ్రాయ్ పోలీసుల చిత్రహింసల వల్లే చనిపోయాడని మావోయిస్టులు ఆరోపిస్తూ..లేఖను విడుదల చేశారు. ఇలా కరోనా పేరుతో రెండో హత్యను పోలీసులు చేశారంటూ లేఖలో పేర్కోన్నారు.

ఇంకా చదవండి ...
ఇటివల వరంగల్ పోలీసులకు పట్టుబడిన దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ కరోనా చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.. కరోనా చికిత్స కోసం వస్తున్న నేపథ్యంలోనే ఆయన వరంగల్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మధును అరెస్ట్ చేసిన పోలీసులు కరోనా చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్టుగా పోలీసులు తెలిపారు.

పీపుల్స్‌ వార్ సిద్దాంతాలకు ఆకర్షితుడై 22 సంవత్సరాల క్రితం చేరి ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటి కార్యదర్శిగా కొనసాగుతున్న మధు అలియాస్ శోభ్రాయ్‌ను ఈనెల 2 వరంగల్ అర్భన్ జిల్లా ములుగు రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు..అనంతరం ఆయన్ను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మధును జుడీషియల్‌ రిమాండ్‌కు పంపే క్రమంలో వైద్య పరీక్షలు చేయడంతో ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు ఈ కోణంలో ఆరా తీశారు.. విచారణలో ఇప్పుడు మావోయిస్టు ఉద్యమంలోని పలువురు కీలక నేతలను సైతం కరోనా చుట్టుముట్టిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు కూడా కరోనా సోకినట్టు తెలిసిందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలోని కీలకమైన పన్నెండు మంది నేతలు కోవిడ్‌ పాజిటివ్‌తో బాధపడుతున్నారన్న విషయం వెల్లడించారు. వీరిలో కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌, తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవుజి, యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, కటకం రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న, కట్టా రాంచందర్‌రెడ్డి అలియాస్‌ వికల్ప్‌, మూల దేవేందర్‌రెడ్డి అలియాస్‌ మాస దడ, కంకటి వెంకటయ్య అలియాస్‌ వికాస్‌, ముచ్చకి ఉజల్‌ అలియాస్‌ రఘు, కొడి మంజుల అలియాస్‌ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత అలియాస్‌ బుర్రా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి వెల్లడిచేశారు.

అయితే వీరంతా బయటకు వస్తే చికిత్స అందిస్తామని ఆయన చెప్పారు. కాని మధుకర్ మృతిపై మావోయిస్టులు అనుమానాలు వ్యక్తం చేశారు..ఆయన్ను చిత్రహింసలకు గురి చేశారని వెల్లడించారు. కామ్రేడ్ గంగోల్‌ను కూడా ఇదే విధంగా హత్య చేశారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఒక కొరియర్ ద్వారా ఆహారంలో విషం కలిపి ఇచ్చారని... దీంతో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారని... వారికి చికిత్స నిమిత్తం బయటికి వెళుతుంటే పోలీసులు అరెస్ట్‌లు చేసి కరోనా పేరుతో హింసించి చంపేస్తున్నారని దక్షిణ సబ్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి నవత ఆరోపిస్తూ లేఖలో పేర్కొన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Hydarabad, Maoist

తదుపరి వార్తలు